Alia Bhatt Vs Kangana Ranaut: కంగనా రనౌత్ అంటే కేవలం మంచి నటి మాత్రమే కాదు, అంతకు మించి.! ఔను, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగన. ఆమె నటించిన సినిమాల కంటే, ఆమె సృష్టించే వివాదాలే ఎక్కువ పాపులర్ అవుతుంటాయి.
ఎవరో ఒకర్ని కెలకడం బాగా అలవాటు చేసేసుకున్న కంగన (Kangana), తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మీద పడింది. అలియా భట్ వల్ల 200 కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్లవుతోందంటూ ‘గంగూబాయ్ కతియావాడి’ (Gangubai Kathiawadi) సినిమాపై సెటైర్లేసింది కంగన.
నిజానికి, Gangubai Kathiawadi సినిమాపై అలియా భట్ చాలా ఆశలే పెట్టుకుంది. ఆ మాటకొస్తే, ఈ సినిమాపై బాలీవుడ్ నుంచి సౌత్ సినిమా వరకూ.. భారీ అంచనాలున్నాయి.
Alia Bhatt Vs Kangana Ranaut కంగన పైత్యం.!
సరే, సినిమా రిజల్ట్ ఏంటి.? అన్నది వేరే చర్చ. సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి సినీ పరిశ్రమలో సర్వసాధారణం. కంగన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ సందర్భాల్లేవా.?

కేవలం తన తండ్రి మహేష్ భట్ వల్లనే అలియా భట్ నటిగా బాలీవుడ్‌లో స్థిరపడిందన్నది కంగన (Kangana Ranaut) ఆరోపణ. అతేనా, అసలు అలియా భట్ (Alia Bhatt) భారత పౌరురాలే కాదని కూడా ఆరోపిస్తోంది కంగన.
లైట్ తీసుకున్న అలియా భట్.!
నోరా ఫతేహీ (Nora Fatehi), కత్రినా కైఫ్ (Katrina Kaif), జాక్వెలైన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez).. లాంటివాళ్ళేమీ భారతీయులు కారు కదా. కానీ, బాలీవుడ్ తెరపై మెరిసిపోతున్నారు. సన్నీలియోన్ (Sunny Leone) సంగతేంటి మరి.?
Also Read: మాళవికకి మండింది.! మంట పెట్టిందెవరంటే.!
ఇక, అలియా భట్ (Alia Bhatt) తన మీద కంగన చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. ‘Inaction Is In Action’ అంటూ వ్యాఖ్యానించింది. స్పందించకపోవడంలోనే, స్పందించడం వుందన్నది దానర్థం. అంటే, సమాధానం చెప్పకుండానే కంగన గూబ గుయ్యిమనిపించేసిందన్నమాట అలియా భట్.