విజయ్ దేవరకొండ ‘లవ్’ సింబల్‌కి అర్థమేంటి.?

 విజయ్ దేవరకొండ ‘లవ్’ సింబల్‌కి అర్థమేంటి.?

Vijay Deverakonda

Vijay Deverakonda Love: రీల్ లైఫ్‌లో ఎలా కనిపిస్తాడో, రియల్ లైఫ్‌లో కూడా ఇంచుమించు అదే తరహాలో విజయ్ దేవరకొండ వుంటాడా.? అంటే, కొన్ని సందర్భాల్లో ‘ఔనేమో’ అనిపిస్తుంటుంది.

అతి తక్కువ సమయంలోనే అనూహ్యమైన స్టార్‌డమ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, తెలుగు ప్రేక్షకుల్నే కాదు తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్నీ తన మాయలో పడేశాడని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో నటిస్తోన్న విజయ్ దేవరకొండ, ఆ సినిమా కోసం బాలీవుడ్ నటి అనన్య పాండేతో (Ananya Panday) ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Vijay Deverakonda Love.. రష్మిక – విజయ్ మధ్య ఏం జరుగుతోంది.?

ఇదిలా వుంటే, విజయ్ దేవరకొండకీ.. (Vijay Deverakonda) నేషనల్ క్రష్ రష్మిక మండన్నకీ మధ్య ‘ఏదో’ వుందంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ‘అదేం లేదు.. మా ఇద్దరి మధ్యా వున్నది జస్ట్ స్నేహం మాత్రమే..’ అని ఇద్దరూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

అయితే, తాజాగా విజయ్ – రష్మిక (Rashmika Mandanna) త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. నేషనల్ మీడియా, తెలుగు మీడియా ఈ అంశంపై బోల్డన్ని కథనాల్ని ప్రచారంలోకి తీసుకొచ్చాయి.

ఇది చాలా హాట్ గురూ.!

అసలే ‘రౌడీ హీరో’, పైగా.. ‘సాలా క్రాస్ బ్రీడ్..’ అంటున్నాడు ‘లైగర్’ (LIGER) సినిమాతో.! అందుకేనేమో, ఆ యారోగెంట్ స్టైల్‌లోనే తన పెళ్ళిపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టేశాడు విజయ్ దేవరకొండ.

Also Read: ఆ తప్పు చేయనంటోన్న అలియా భట్.!

‘లవ్’ సింబల్ పెట్టాడు.. ఆ తర్వాత ‘da’ అంటూ పేర్కొన్నాడు ట్వీట్‌లో. దానర్థమేంటి చెప్మా.? అర్థం చేసుకున్నోళ్ళకి అర్థం చేసుకున్నంత. ‘As usual nonsense’ అని పేర్కొంటూ, ‘Don’t we just’ .. ‘లవ్ సింబల్’కి తోడుగా ‘da’ అనేశాడు విజయ్ దేవరకొండ. అద్గదీ అసలు సంగతి.

అన్నట్టు, రష్మిక మండన్న (Rashmika) – విజయ్ దేవరకొండ జంటగా (Vijay Deverakonda Love) బాలీవుడ్ మీడియాకి పలు సందర్భాల్లో చిక్కుతూనే వున్న విషయం విదితమే.! జస్ట్ అది స్నేహం.. అనుకోవాలంతే.

Digiqole Ad

Related post