Table of Contents
Allu Aravind Tollywood Kumpati.. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదే.! ఇదీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యల సారాంశం.
ఇది అందరికీ తెలిసిన విషయమే కదా.! కొత్తగా, అల్లు అరవింద్ ‘కుంపటి’ రాజేయడం దేనికి సంకేతం.? ఇదీ ఇప్పుడు సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ.
ఔను, మెగా కాంపౌండ్‌లోనే ‘అల్లు’ కుంపటి తయారయ్యింది ఇటీవలి కాలంలో.! ఆ మెగా కాంపౌండ్‌ని తూలనాడటంలో అల్లు కుంపటి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.
Allu Aravind Tollywood Kumpati.. అవార్డులు.. కొనుక్కుంటే వస్తాయ్.!
అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమాకి గాను నటుడిగా జాతీయ పురస్కారాన్ని కొన్నాళ్ళ క్రితం అందుకున్నాడు.
సాధారణంగా అలాంటి పాత్రలకు జాతీయ అవార్డుల్ని ఇవ్వరు. కానీ, అల్లు అర్జున్‌కి అవార్డు దక్కింది.

అదో చిత్రం. ‘కొనుక్కుంటే అవార్డులొస్తాయ్’ అనే మాట ఇంకోసారి నిరూపితమయ్యిందంటూ పెద్ద చర్చే జరిగింది.
జాతీయ పురస్కారాల లెక్కలు మారాయ్.. అది ఇప్పటి మాట కాదు, ఎప్పటినుంచో వస్తున్నదే. తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ పురస్కారాల్లో చాలా అరుదుగా చోటు దక్కుతుంటుంది.
అలా సరిపెట్టుకోవాలంతే..
సర్లే, ఏదో ఒక అవార్డు.. ఇచ్చారు కదా.. అని పండగ చేసుకోవడం తప్ప, చేయగలిగిందేమీ లేదు. ఈసారి ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలొచ్చాయ్.
చిన్న సినిమాలకీ పురస్కారాలు దక్కాయ్. దాంతో, పరిశ్రమ ప్రముఖులు విజేతల్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు.
గతంలో, అల్లు అర్జున్‌కి కూడా పరిశ్రమ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా అభినందనలు పోటెత్తాయ్.
అయితే, అల్లు అరవింద్‌కి అది సరిపోలేదు. పరిశ్రమ తరఫున సన్మానాల్ని ఆశించారాయన.. తన కుమారుడికి సంబంధించి. తాజా విజేతల వంక పెట్టి, ‘కుంపటి’ వ్యాఖ్యల్ని అరవింద్ చేశారు.
అల్లు అరవింద్‌కి బాధ్యత లేదా.?
అల్లు అరవింద్ అంటే ప్రముఖ నిర్మాత. ఆయనే, చొరవ తీసుకుని.. పరిశ్రమ ప్రముఖుల్ని ఏకతాటిపైకి తెచ్చి, అవార్డు గ్రహీతలకి పరిశ్రమ తరఫున సన్మానాలు చేయించి వుండాలి కదా.?
ప్చ్.. అలాంటి ప్రయత్నాలు అల్లు అరవింద్ చేసిన దాఖలాల్లేవు. మరి, ఈ ‘కుంపటి’ వ్యాఖ్యలెందుకు చేయడం.?
మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కితే, దాని మీద అక్కసు వెల్లగక్కారు కొందరు సినీ ప్రముఖులు.
Also Read: టెస్టు క్రికెట్టుకి పూర్వ వైభవం వస్తుందా.?
పరిశ్రమ తరఫున, వజ్రోత్సవాల్లో చిరంజీవిని సత్కరించే ప్రయత్నాలు జరిగితే, దాని మీద మోహన్‌బాబు చేసిన యాగీ ఎలా మర్చిపోగలం.?
ఒక్కటి మాత్రం నిజం.. సినీ పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదే.! కానీ, అల్లు అరవింద్ కూడా ఆ కుంపటిలో భాగమన్న విషయాన్ని మర్చిపోతే ఎలా.?
అల్లు అర్జున్ అరెస్టయి, జైలుకు వెళ్ళొచ్చినప్పుడు.. పరిశ్రమ ప్రముఖులందరితోనూ తన కుమారుడికి పరామర్శలు చేయించిన అరవింద్, అవార్డుల విషయంలో.. సత్కారాలెందుకు చేయించలేకపోయినట్టు.?