గోకుడు రోగం.! నయనతార.. నువ్వు కూడానా.?

Nayanthara

Nayanthara Casting Couch.. అమ్మాయి కనపడితే చాలు గోకడం.. అనేది ఓ మానసిక రోగం.! దీన్ని ప్రకృతి ధర్మమని కొందరు పురుష పుంగవులు సమర్థించుకోవచ్చుగాక.. కానీ, కాదు.!

ఈ గోకుడు రోగం అన్ని రంగాల్లోనూ వుంది. సినిమా రంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. పైగా, ఇది గ్లామరస్ ఇండస్ట్రీ, ఇక్కడ ఇంకాస్త ఎక్కువే వుండొచ్చు గోకుడు వ్యవహారం.

తాజాగా, ఈ గోకుడు పైత్యానికి తానూ బాధితురాలినేనని అంటోందిట నయనతార.!

Nayanthara Casting Couch.. ఇప్పుడేల.. ఈ గోకుడు గోల.?

ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చిందనీ.. అయితే, ‘కాంప్రమైజ్’ అవ్వాల్సిందిగా కొందరు కోరారని నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది.

డేరింగ్ అండ్ డాషింగ్.. అని చెప్పుకునే నయనతార, రాధిక ఆప్టే లాంటోళ్ళే.. ఇలా సస్పెన్స్‌లో వదిలేస్తే ఎలా.?

Mudra369

కాంప్రమైజ్, కమిట్మెంట్.. పేరైతేనా అది ‘కాస్టింగ్ కోచ్’ వ్యవహారమే. నయనతార మాత్రం ‘కాంప్రమైజ్’ అవలేదట. ‘కమిట్మెంట్’ ఇవ్వలేదట. ‘కాస్టింగ్ కౌచ్’కి బలి కాలేదట.!

Nayanthara Casting Couch
Nayanthara

ఏ సినిమా అది.? ఇంతకీ ఆ సినిమా చేసిందా.? లేదా.? అదైతే సస్పెన్స్. ఎందుకంటే, నయనతార (Nayanthara) పూర్తి వివరాలివ్వలేదు మరి.!

అప్పట్లో రాధికా ఆప్టే..

దక్షిణాదిలో ఓ పెద్ద హీరో సినిమాలో నటించినప్పుడు, తనతో అభ్యంతరకరంగా ఆ హీరో ప్రవర్తించాడంటూ రాధికా ఆప్టే సంచలన ఆరోపణలు చేసింది.

Radhika Apte

ఎవరా హీరో.? అన్నది మాత్రం బయటపెట్టలేదు రాధికా ఆప్టే (Radhika Apte). ఇదో ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. ఆ హీరో పేరు చెప్పేస్తే, అసలు సంగతేంటో తెలిసిపోతుంది కదా.?

Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!

కానీ, చెప్పరుగాక చెప్పరు. ‘మీ టూ..’ అని జస్ట్ ట్రెండింగ్ ఇష్యూ చేస్తారంతే ఈ అందాల భామలు.. అన్న విమర్శలు వినిపిస్తున్నాసరే.. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతారు.

డేరింగ్ అండ్ డాషింగ్.. అని చెప్పుకునే నయనతార, రాధిక ఆప్టే (Radhika Apte) లాంటోళ్ళే.. ఇలా సస్పెన్స్‌లో వదిలేస్తే ఎలా.?

hellomudra

Related post