Allu Arjun Pushpa 3.. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise) సినిమాకి తొలి రోజు వచ్చిన నెగెటివ్ టాక్, ఆ తర్వాత సినిమా అందుకున్న విజయం.. చాలామందిని ఆశ్చర్యపరిచాయి.
నిజానికి, ‘పుష్ప’ (Pushpa Movie) సినిమాని ఒకే పార్ట్‌లో తెరకెక్కించాలనుకున్నారుగానీ, అనివార్య కారణాల వల్ల రెండు పార్టులవుతోంది. రెండో పార్ట్‌కి ‘పుష్ప ది రూల్’ అని పేరు పెట్టారు.
Allu Arjun Pushpa 3.. మూడో పుష్ప.. ఎలా ప్రచారంలోకి వచ్చిందబ్బా.?
‘పుష్ప ది రూల్’ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్నదానిపై కొంత గందరగోళం కనిపిస్తోంది. ఇంతలోనే, పుష్ప మూడో పార్ట్.. అంటూ సరికొత్త ప్రచారం తెరపైకొచ్చింది.

మూడో పార్టుకీ సిద్ధంగా వుండాలంటూ దర్శకుడు సుకుమార్ తనకు చెప్పినట్లు నటుడు ఫహాద్ ఫాజిల్ వెల్లడించడంతో, మూడో పార్ట్ ఎప్పుడు.? అన్న చర్చ షురూ అయ్యింది.
‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise) సాధించిన విజయం నేపథ్యంలో, ‘పుష్ప ది రూల్’ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే సినిమా సెట్స్ మీదకు వెళ్ళడంలో ఆలస్యం జరుగుతోంది.
ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, మూడో పార్ట్ కోసం ‘స్పేస్ వదలడం’ అనేది ఎంత కష్టమైన వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మూడో ముచ్చట.. అంత తేలిక కాదు.!
‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) హిట్టయితే, మూడో పార్ట్ పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకవేళ ‘పుష్ప ది రూల్’ అంచనాల్ని అందుకోలేకపోతే.? అది మళ్ళీ ఇంకో తలనొప్పి.
సుకుమార్ ఏ ఉద్దేశ్యంతో ఫహాద్ ఫాజిల్‌కి మూడో పార్ట్ గురించి సంకేతాలు ఇచ్చాడోగానీ, ఈ విషయమై ‘పుష్ప’ యూనిట్ ఇంతవరకు అధికారికంగా స్పందించింది లేదు.
Also Read: శ్రావణ భార్గవి.! ‘ఒక పరి’.. వివాదంతో ‘సరి’ సరి.!
‘పుష్ప’లో అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తే, ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేసింది.
ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.