అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్ (Stylish Star Allu Arjun). మరి, పక్కా మాస్ పాత్రలో కనిపిస్తే.. అది కూడా రొటీన్‌కి భిన్నంగా.. రఫ్ లుక్‌తో కనిపిస్తే.! (Allu Arjun Pushpa Raj Prelude Stylish Power) చాలామంది అభిమానుల్నీ వేధిస్తోన్న ప్రశ్న ఇది.
కానీ, అక్కడున్నది అల్లు అర్జున్.. ఆపై సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్.. ఇంకేముంది, అంచనాలకు మించి.. అన్నట్టుంటుంది. ‘పుష్ప’ మేకర్స్, అల్లు అర్జున్ అభిమానుల ఉత్కంఠకు కాస్త తెరదించారు.. అప్‌డేట్ ఎక్కడ.? అంటూ ఒకింత చిరు కోపం ప్రదర్శిస్తున్న అభిమానుల్ని నిర్మాన సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఎక్కువ కాలం అలాగే బాధపెట్టాలనుకోలేదు.
ఈ క్రమంలోనే ‘పుష్ప’ నుంచి Prelude బయటకు వచ్చింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే.. కాదు కాదు, అంతకు మించి.. అనే స్థాయిలో సినిమాని సుకుమార్ (Director Sukumar) తెరకెక్కించినట్లే కనిపిస్తోంది. ప్రీల్యూడ్‌లోనే అంత పవర్ కనిపించింది.
అల్లు అర్జున్ కనిపించలేదు.. పుష్పరాజ్ పాత్ర ఎలా వుంటుంది.? ఎంత పవర్ ఆ పాత్రకి దర్శకుడు ఆపాదించాడు.? అనేవాటిపై చూచాయిగా ఓ స్పష్టత వచ్చేసింది. ఏప్రిల్ 7వ తేదీన పుష్పరాజ్‌ని (Allu Arjun Pushpa Raj Prelude Stylish Power) పరిచయం చేయబోతోంది ‘పుష్ప’ యూనిట్.
రష్మిక మండన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
