పొలిటికల్ ‘వకీల్ సాబ్’.. చాచి కొడితే, గూబ గుయ్యిమనాలె.!
అసలు పవన్ కళ్యాణ్ (Vakeel Saab Pawan Kalyn Political Power) సినిమాలు ఎందుకు చెయ్యాలి.? ఇంకెందుకు, అభిమానుల కోసం. ‘అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు..’ అని స్వయంగా పవన్ కళ్యాణ్ చెబితే, ఆ కిక్కు ఏ స్థాయిలో అభిమానులకు ఎక్కేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అవును, కొత్త పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కనిపిస్తున్నాడిప్పుడు అభిమానులకి. ఇంతకు ముందు ఆయనలో ఎప్పుడూ వారికి కనిపించని కొత్త కోణమిది. అభిమానులంటే, పవన్ కళ్యాణ్ ఓ బాధ్యతగా భావిస్తారు.
అందుకే, అభిమానులకు ఏ కష్టమొచ్చినా, అక్కడ వాలిపోతారు. అయితే, అభిమానుల మీద తనకున్న ప్రేమను చాటుకోవడానికి సమయం సందర్భం కోసం ఎదురుచూస్తారు తప్ప.. ఎక్కడంటే అక్కడ ఊకదంపుడు ప్రసంగాలిచ్చేయరు.
‘రాజకీయాల్ని బాధ్యతగా తీసుకున్నాను. అందుకే, సినిమాలకు దూరమయ్యాను. కానీ, అదే రాజకీయ పార్టీ నడపడానికి, నా కుటుంబం నడవడానికీ, నాకు తెలిసిన విద్య నటించడమే.. అందుకే, సినిమాల్లో నటిస్తున్నాను..’ అని గతంలోనే చెప్పిన పవన్ (Janasenani Pawan Kalyan), ఆ విషయాన్ని ఇంకోసారి కుండబద్దలుగొట్టేశారు ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు ముందు.
కొందరికి సిమెంట్ వ్యాపారాలున్నాయి.. కొందరికి పాల వ్యాపారాలున్నాయి.. నాకు సినిమానే వ్యాపకం.. నేను ఆ పని చేయకూడదా.? అని పవన్ కళ్యాణ్, తన రాజకీయ ప్రత్యర్థుల్ని కడిగి పారేశారు. పేకాట క్లబ్బులు నడిపేవాళ్ళు ఎమ్మెల్యేలవుతోంటే, నేనెందుకు ప్రజల తరఫున నిలబడకూడదు.? అని పవన్ (Jana Sena Party Chief Pawan Kalyan) సంధించిన ప్రశ్న సామాన్యుడిని సైతం ఆలోచింపజేస్తోంది.
రాజకీయాల్ని బాధ్యతగా తీసుకున్నప్పుడు గెలుపోటములు లెక్కల్లోకి రావు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలనుకున్నపుడు మాత్రమే ఆ గెలుపోటముల లెక్కలుంటాయ్. ఇదీ ‘వకీల్ సాబ్’ మాట. ఎవరికి ఎక్కడ ఎంత గట్టిగా తగలాలో వాళ్ళకి అంతే గట్టిగా తగిలేశాయి.
దటీజ్ ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్. ఎవరికి ఏ కష్టమొచ్చినా, తమ సమస్యకు పరిష్కారం పవన్ కళ్యాణ్ వద్ద దొరుకుతుందనే నమ్మకంతో వున్నారంటే.. అంతకన్నా ఏ పదవి (Vakeel Saab Pawan Kalyn Political Power) గొప్పది.?