Allu Arjun Sreeleela AHA.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యూత్ క్రేజ్ శ్రీలీల కలిసి ఇటీవల ఓ కమర్షియల్ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ‘అర్జున లీల’ అనే క్యాప్షన్‌తో ఈ యాడ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
అల్లు అర్జున్‌తో శ్రీలీల ఎంటర్‌టైన్‌మెంట్ అబ్బో.! వాచిపోద్ది.. చిరిగిపోద్ది.. అంటూ మొన్న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటోలతో చాలా బిల్డప్ ఇచ్చేశారు.
నిజంగానే ఫోటోలయితే బాగున్నాయ్. మరి, యాడ్ సంగతేంటీ.? తాజాగా ఆ యాడ్ రిలీజ్ అయ్యింది. అంత సీనూ, సినిమా లేదని తేల్చేశారు అభిమానులు.
Allu Arjun Sreleela AHA.. ‘అర్జున లీల’ కి అంత సీను లేదుగా.!
ఓ యాక్షన్ సీన్‌తో కలిపి, రెండు పాటలూ, ఓ ఎమోషనల్ సీన్.. కలిపి ఓ డిఫరెంట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. బన్నీ, శ్రీలీలతో పాటూ, కమెడియన్ చమ్మక్ చంద్ర కూడా కనిపించాడీ వీడియోలో.
‘ఆహా’ ఓటీటీ ఛానెల్‌ని ప్రమోట్ చేసే నేపథ్యంలో ఈ యాడ్ షూట్ జరిగిందన్న సంగతి తెలిసిందే.
మాటల మాంత్రికుడు, చెయ్యి తిరిగిన డైరెక్షన్ స్కిల్స్ వున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యాడ్‌ని షూట్ చేయడం విశేషం.
త్రివిక్రమ్ చేసిన యాడ్ అంటే.. ఓ రేంజ్‌లో వుంటుంది. అందులోనూ అల్లు అర్జున్, శ్రీలీల అంటే ఆ రేంజ్ నెక్స్‌ట్ లెవల్ వుంటుంది.. అని ఊహించుకున్నారంతా.
ఈ మాస్ ఏడ సరిపోద్ది బాస్.!
తూచ్.! అంతా వుత్తదే..! అని యాడ్ చూసిన సినీ ప్రియులు తేల్చేశారు. అల్లు అర్జున్ మంచి డాన్సర్. శ్రీలీల అందులో గట్టి పోటీ బన్నీకి.
అలాంటి ఇద్దరు స్టార్స్‌తో షూట్ చేసిన యాడ్‌లో ఇంకాస్త డాన్సింగ్ స్టెప్స్ వుంటే బాగుండేదని ప్యాన్స్ అభిప్రాయం. ‘సామజవరగమన..’ వంటి క్యూట్ అండ్ డీసెంట్ సాంగ్ వేసుకున్నారు.
సింపుల్‌గా తేల్చేశారు. అలాగే, ‘సినిమా చూపిస్త మామా..’ అనే ఓ మాస్ సాంగ్‌నీ వేసుకున్నారు. అది కూడా సింగిల్ స్టెప్‌లో తుస్సుమనిపించేశారు.
శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అల్లు అర్జున్ ఎనర్జీని ఇంకాస్త యూజ్ చేసుకుని మరింత బ్రైట్‌గా ఈ యాడ్‌ని డిజైన్ చేసి వుండాల్సింది.. అనే అభిప్రాయాలు వస్తున్నాయ్.
Also Read: Adipurush Struggle.. ‘ఆదిపురుష్’కి అదే పెద్ద సమస్య.!
అయితే, అల్లు అర్జున్ ఏం చేసినా ట్రెండింగే.. ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ నడుస్తోంది. సో, ఎలా వున్నా.. ఏం తక్కువైనా ఈ యాడ్ అయితే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అయిపోతోంది.