AlluArjun JrNTR Pushpa Party మీకు తెలుసా.? అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్.. ఒకర్నొకరు ‘బావా’ అని పిలుచుకుంటారని.!
చాలాకాలంగా ఇద్దరి మధ్యా (Allu Arjun Jr NTR) అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయ్. కాకపోతే, అభిమానులే కొట్టుకు ఛస్తుంటారు.
ఎన్టీయార్‌ని అల్లు అర్జున్ అభిమానులు ట్రోల్ చేస్తే, అల్లు అర్జున్‌ని (Allu Arjun) ఎన్టీయార్ అభిమానులు ట్రోల్ చేయడం చాలాకాలంగా జరుగుతున్నదే.
AlluArjun JrNTR Pushpa Party.. పార్టీ లేదా బావా.?
తాజాగా, అల్లు అర్జున్ (Happy Birthday Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా, ‘బావా పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీటేశాడు ఎన్టీయార్.
‘బావ’ ఎన్టీయార్ (Jr NTR) విషెస్‌కి మురిసిపోయిన అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), ‘బావా అందుకో వార్మ్ హగ్స్..’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
అభిమానులంటే హీరోలకు మంచి పేరు తెచ్చేటోళ్ళు ఒకప్పుడు.!
కానీ, ఆ అభిమానమే ఇప్పుడు దురభిమానంగా మారుతోంది.!
హీరోలు చిరాకు పడే స్థాయికి అభిమానులు అత్యంత జుగుప్సాకరంగా తయారయ్యారు.!
అభిమానం ముసుగులో తాము అభిమానిస్తున్న హీరోల్నే ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు.!
ఇతర హీరోల్ని ట్రోల్ చేయడంలో సిగ్గూ ఎగ్గూ లేకుండా వ్యవహరిస్తున్నారు.!
అన్నదమ్ముల్లా.. బావ బావమరుదుల్లా వుంటోన్న హీరోల మధ్య చిచ్చుపెడుతున్న అభిమానులు.!
Mudra369
‘హగ్స్ మాత్రమేనా.? పార్టీ లేదా పుష్పా.?’ అంటూ అల్లు అర్జున్‌ని జూనియర్ ఎన్టీయార్ (Man Of Masses NTR) సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం గమనార్హం. ‘వస్తున్నా’ అంటూ అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చాడు.!
ఈ ట్వీట్ల సందడి, అభిమానులకు బోల్డంత ఆనందాన్నిస్తోంది. ఇరువురి అభిమానులూ, ఇరువురి హీరోల్నీ పొగుడుతూ ట్వీట్లేస్తున్నారు.
ఇంకోపక్క, ట్రోలింగ్ మాత్రం షరామామూలుగానే ఇరువురి మీదా జరుగుతోంది.. పైత్యం దారి పైత్యానిదే.. అభిమానం దారి అభిమానానిదే.!
మల్టీస్టారర్ చేసెయ్యొచ్చగా..
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ (Young Tiger NTR) తమ మధ్య అన్నదమ్ముల అనుబంధం వుందన్నారు. ఇద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేశారు.!
సో, అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) కూడా ఓ మల్టీస్టారర్ చేసేస్తే పోలా.? ఆ బాధ్యత రాజమౌళి (SS Rajamouli) తీసుకుంటాడా.? సుకుమార్ (Director Sukumar) ట్రై చేస్తాడా.?