Alluri Sitarama Raju అల్లూరి సీతారామరాజు.. ఫలానా సినిమాలో హీరో ఈ గెటప్ వేశాడు.! ఫలానా సినిమాకి ఈ టైటిల్ పెట్టారు.! అంతేనా.? అల్లూరి సీతారామరాజు అంటే ఇంకేమన్నా వుందా.?
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఓ సుభాష్ చంద్రబోస్, ఓ భగత్ సింగ్.. ఇలాగే ఓ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఓ అల్లూరి సీతారామరాజు.!
విప్లవోద్యమం.. అనగానే నక్సలైట్లు, ఎన్‌కౌంటర్లు, గ్రే హౌండ్స్, కూంబింగ్ గుర్తుకు రావడం ఈ రోజుల్లో సహజం. కానీ, ఇకప్పుడు విప్లవోద్యమం తాలూకు లెక్క వేరు.
Alluri Sitarama Raju.. అల్లూరి స్ఫూర్తి ఇప్పుడెక్కడుంది.?
అల్లూరి సీతారామరాజు అంటే విప్తవ యోధుడు.! ఎంతోమందిలో స్ఫూర్తి రగిలించిన మహా నాయకుడు. ఆ పోరాట స్ఫూర్తి ఇప్పటికీ అలాగే వుందా.? ఇదైతే మిలియన్ డాలర్ల ప్రశ్న.
జయంతి లేదా వర్ధంతికి మాత్రమే మహనీయుల్ని, వారి ఘనతల్నీ, వారి త్యాగాల్ని గుర్తు చేసుకోవడం పరిపాటిగా మారింది.
మహాత్మగాంధీ విగ్రహానికి పూల మాల వేస్తే ఎన్ని ఓట్లు వస్తాయ్.? అని రాజకీయ నాయకులు ఆలోచిస్తున్న రోజులివి. అంబేద్కర్ పేరు పెడితే ఎన్ని ఓట్లు వస్తాయి.? అని లెక్కలేసుకుంటున్న రాజకీయం రాజ్యమేలుతున్న రోజులివి.
పోరాటం సంగతి తర్వాత, ప్రశ్నిస్తే.. ప్రాణాలు మిగుల్తాయా.?
అల్లూరి అంటే తెగువ.. అలూరి అంటే త్యాగం.. అల్లూరి అంటే పోరాటం.. అల్లూరి అంటే ప్రశ్నించే తత్వం.. అల్లూరి అంటే ధైర్యం.. అల్లూరి అంటే విప్లవం.. కానీ, ఆ స్ఫూర్తి ఇప్పుడేమైపోయింది.?
జయంతికో, వర్ధంతికో వర్ధంతికో పూల మాలలు వేసే పాలకులు, ప్రశ్నించేవారిని ఎందుకు జైళ్ళలో పెడుతున్నట్లు.? ఇదొక్కటి చాలదా, అల్లూరి పేరుతో ఇప్పుడు నడుస్తున్నది కేవలం రాజకీయం మాత్రమేనని చెప్పడానికి.?
ఔను, అల్లూరి సీతా రామరాజు పేరు ఇప్పుడు ఓ రాజకీయ అవసరం చాలామందికి. ఆయన్ని ఓ సామాజిక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నది నిర్వివాదాంశం.
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
అల్లూరి చుట్టూ జరుగుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. నిస్సిగ్గు రాజకీయమిది. అల్లూరి పేరుతో జరుగుతున్న పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు అత్యంత హాస్యాస్పదం, విచారకరం కూడా.
ఆ అల్లూరి ఇప్పుడు జీవించి వుంటే, తన చుట్టూ జరుగుతున్న పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు చూసి, ఇందుకేనా తాను ఉద్యమించింది.? ప్రాణత్యాగం చేసింది.? అంటూ చింతించేవారేమో.!