God Father Chiranjeevi Politics.. సినిమా వేరు, రాజకీయం వేరు. మెగాస్టార్ చిరంజీవికి తక్కువ సమయంలోనే ఈ విషయం అర్థమయ్యింది.
సినిమా హీరోని కుల మతాలకతీతంగా అభిమానిస్తారు. రాజకీయాల్లో అలా కాదు. కులం కుంపటి రాజేస్తారు.. మతం రంగు పూస్తారు.! ప్రాంతీయ మకిలి కూడా అంటగట్టేస్తారు.
‘రాజకీయ నాయకుడు’ అనగానే బురద చల్లేయడం, రాజకీయాలు వదిలేయగానే ‘అందరివాడు’ అనడం.. ఇది చిరంజీవికి స్వయంగా అనుభవమైంది.
రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయడానికే వస్తారు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు సేవ చేసేవాళ్ళకి రాజకీయాల్లో చోటు లేదు. సేవ ముసుగులో వ్యాపారాలు చేసుకునేవాళ్ళకే రాజకీయాల్లో పెద్ద పీట.
సేవ చెయ్యాలనుకుంటే కష్టమే సుమీ.!
ప్రజలకు నిజంగా మేలు చేస్తామని రాజకీయాల్లోకి వస్తే, ఆ ప్రజలే తొక్కిపడేస్తారు. అదే మాయమాటలు చెప్పి, ఓట్లను కరెన్సీ నోట్లతో కొనేసేవారిని గద్దెనెక్కిస్తారు.

యధా రాజ, తధా ప్రజ కాదు. యధా ప్రజ.. తధా రాజ.. అయిపోయిందిప్పుడు పరిస్థితి. ఓటర్లు కరెన్సీ నోట్లకు కక్కుర్తి పడుతున్నారు, వాళ్ళని రాజకీయ నాయకులు కరెన్సీ నోట్లతో కొనేస్తున్నారు.
ఇంతకీ, చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారా.? ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఎవరో ఆఫర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.?
God Father Chiranjeevi Politics.. ఎందుకొచ్చిన రాజకీయం.?
హాయిగా వున్న ప్రాణాన్ని సంకటంలో చిరంజీవి ఎందుకు పెట్టుకుంటారు.? ఈసారి ఛాన్సే లేదు. నిజానికి, పవన్ కళ్యాణ్ కూడా తన అన్న నేర్చుకున్న పాఠాన్నే అవగతం చేసుకుంటే సరిపోతుంది.
సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’ అంటే, జనం విజిల్స్ వేస్తారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అవుదామనుకుంటే.. షరామామూలే.! సో, చిరంజీవి ఆ రిస్క్ మళ్ళీ చేసే అవకాశమే లేదు.
Also Read: గెలవాలంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి.?
‘జనం మారాలి..’ అని ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేదు. జనం మారరు. ఆ మారని జనం కోసం పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా గొంతు చించుకోవడం దండగే కదా.!