Amala Paul Pregnancy.. అరరె.! అమలా పాల్ పెళ్ళయిపోయిందే.! పెళ్ళవడమేంటి.? తల్లి కూడా అవబోతుంటేనూ.! ఇది అసలు సిసలు షాకింగ్ న్యూస్ అంటే.!
ఇందులో షాక్ అవడమేంటి.? ఇదో కొత్త ట్రెండ్ మరీ.! ఆ కొత్త ట్రెండ్‌కి జనాలు కూడా అలవాటు పడిపోయారు.!
కొన్నాళ్ళ క్రితం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన పెళ్ళి విషయాన్ని ప్రకటించింది. చకచకా పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్ళయిపోయింది కూడా.!
ఆ వెంటనే, ప్రెగ్నెన్సీ విషయాన్నీ అలియా భట్ ప్రకటించేసింది. దాంతో, జనం షాక్ అయ్యారు. తర్వాత ‘మామూలే’ అని సరిపెట్టుకున్నారు.
Amala Paul Pregnancy.. అలియా భట్ బాటలో అమలా పాల్.!
అచ్చం అదే పరిస్థితి ఇప్పుడు అమలా పాల్ విషయంలోనూ ఆమె అభిమానులకి ఎదురయ్యింది.
ఇలా పెళ్ళయ్యింది.. అలా ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసేసుకున్నావ్.. ఇదెలా సాధ్యం.? అని అమలా పాల్‌ని ప్రశ్నిస్తున్నారు నెటిజనం.
ఆమె ప్రెగ్నెన్సీ ఆమె ఇష్టం. మధ్యలో ఈ నెటిజనం గోలేంటి.? ట్రోలింగ్ కోసం ఏదో ఒక కంటెంట్ నెటిజనానికి కావాలి. ఆ కంటెంట్‌ని సెలబ్రిటీలు ఇస్తున్నారంతే.!
అంతే మరి, అలాగే సరిపెట్టుకోవాలి. అన్నట్టు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టూ త్రీ.. అంటూ కొత్త లెక్కలు చెబుతూ, అమలా పాల్ తన ప్రెగ్నెన్సీ గురించి వెల్లడించింది.
ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని ఫొటోల్ని కూడా అమలా పాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.