కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.!

 కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.!

Gender Changing

Gender Changing In India.. మొన్నామధ్యన ఓ రాజకీయ ప్రముఖుడు తన పేరు చివర్న ‘రెడ్డి’ తగిలించుకున్నాడు. ఈ మేరకు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని, పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.

ఎవరో గెలిస్తే, ఆయన పేరు మార్చుకోవడమేంటి.. మూర్ఖత్వం కాకపోతే.! అంత నిస్సిగ్గు రాజకీయం చేశాడతడు.!

సరే, ఆ సంగతి పక్కన పెడితే.. మత మార్పిడుల్ని చూస్తుంటాం.! అదే, జెండర్ మార్పిడి అయితేనో.! కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.

Gender Changing In India.. కారణాలేవైనాగానీ..

వివిధ కారణాలతో జెండర్ మార్పు కూడా ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. హిజ్రాలది ఆ బాపతే. ట్రాన్స్‌జెండర్లను చిన్న చూపు చూసే ఒకప్పటి రోజులు కావివి.

ఇంకోపక్క, తనను తాను పురుషుడిగా కాకుండా, స్త్రీగా భావించి.. జెండర్ మార్చుకునేవాళ్ళు కొత్తగా తెరపైకొస్తున్నారు.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. సమాజంపై చాలా ప్రభావం చూపుతున్నాయ్. ఓటీటీ పుణ్యమా.. అని దూసుకొస్తున్న వెస్ట్రన్ కంటెంట్.. ఈ జెండర్ మార్పు ప్రక్రియకు ఇంకాస్త ఊపునిస్తోందనే వాదన వుంది.

Mudra369

ఎలాంటి సర్జరీలూ చేయించుకోకుండానే పురుషులు, మహిళలుగా సరికొత్త గుర్తింపుని, అధికారికంగా పొందుతున్న పరిస్థితులివి. అలాగే, మహిళలు కూడా జెండర్ మార్పుని సంతరించుకుంటున్నారు.

సర్వోన్నత న్యాయస్థానం కూడా ‘ఇది తప్పు కాదు’ అని ఓ కేసులో తీర్పు వెల్లడించిన దరిమిలా, ఆ దిశగా ‘మార్పులు’ ఎక్కువవుతున్నాయ్.

ఆధునిక సమాజంలో..

ఇది ఆధునిక సమాజం.! ఒకప్పుడు తప్పు, పాపం, నేరం.. అనుకున్నవన్నీ ఇప్పుడు ఒప్పువుతున్నాయ్.. అదీ చట్టబద్ధంగా.!

అందుకే, కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్.. అని ఇప్పుడంతా అనుకోవాల్సి వస్తోంది. పాత పాటే ఇది కాకపోతే, దానికి కొత్త అర్థం చెబుతున్నారిప్పుడు.

సమాజంలో ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవం దక్కాలన్న కోణంలో, ఈ తరహా మార్పులు చోటు చేసుకుంటే, దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు.

మగాళ్ళలో ఆడ లక్షణాలు.. ఆడవాళ్ళలో మగ లక్షణాలు.. వీటిపై ఒకప్పటి ఆలోచనలకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

Mudra369

కానీ, ఈ మార్పులు సమాజంపై ‘వ్యతిరేక ప్రభావం’ చూపితేనో.! దానికి ఎవరు బాధ్యత వహిస్తారు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తోంది.

Also Read: జోకర్ మాయ్య: ఈవీఎమ్.. ఎలాన్ మస్క్.. ఇదో ఫన్నీ టాస్క్.!

మారుతున్న సమాజంతోపాటు, మనమూ మారిపోవాల్సిందే. తప్పొప్పుల పంచాయితీకి అర్థమే లేకుండా పోయింది. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అంతా హంబక్ అయిపోయిందిప్పుడు.

Digiqole Ad

Related post