Amala Paul Trendy Styling.. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అమలా పాల్. ‘బెజవాడ’ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించింది.
ఆ తర్వాత ‘నాయక్’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో జత కట్టింది. అప్పటికే తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన అనుభవం చాలా చాలా ఎక్కువ అమలా పాల్‌కి.
హోమ్లీ రోల్.. ట్రెండీ రోల్ ఏదైనా కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది అమలా పాల్‌కి.
సినీ బ్యాక్ గ్రౌండ్ కన్నా.. అమలా పాల్ తన పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా జనానికి కనెక్టింగ్ అని చెప్పడం అతిశయోక్తి అనిపించదేమో.
Amala Paul Trendy Styling.. ఆ పెళ్లి పెటాకులై.. కెరీర్ రేసు గుర్రమై..!
తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌తో వివాహం, విడాకుల నిమిత్తం తరచూ వార్తల్లో నిలిచింది అమలా పాల్.
విజయ్‌తో విడాకుల తర్వాత సినిమాల్లో చాలా బిజీ అయిపోయింది. ఆ క్రమంలోనే కొన్ని హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లోనూ అమలా పాల్ నటించింది.

‘ఆమె’ సినిమాతో అమలా పాల్ సంచలనంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ‘కుడి ఎడమైతే’ అను ఓ వెబ్ సిరీస్‌లోనూ అమలా పాల్ నటించింది.
మొదటి పెళ్ళి వర్కవుట్ అవకపోయినా, రెండో పెళ్ళి తర్వాత మాత్రం.. ఫ్యామిలీ లైఫ్‌ని బాగానే ఎంజాయ్ చేస్తోంది అమలా పాల్. ఆమె ఓ బిడ్డకు తల్లయ్యింది కూడా కొన్నాళ్ళ క్రితమే.
ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు అమలా పాల్ రంగం సిద్ధం చేసుకుంటోంది.
కొత్తగా సరికొత్తగా..
ప్రస్తుతం సినిమాల్లో కాస్త వేగం తగ్గించి ఫ్రెష్ పర్సనల్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్న అమలా పాల్, మంచి అవకాశాలొస్తే.. నటించేందుకూ సిద్ధంగా వుంది.
ఆ సంగతి అటుంచితే, సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కొన్ని క్రేజీ పిక్స్ షేర్ చేసే అమలా పాల్ సోషల్ మీడియా హ్యండిల్‌లో డిఫరెంట్ డిజైనర్ పిక్స్ హల్ చల్ చేస్తున్నాయ్.
ఈ పిక్స్‌లో అమలా పాల్ ధరించిన రంగు రంగుల డిజైనర్ ప్యాంట్ డిఫరెంట్‌గా ట్రెండీ అవుతూ, ఎట్రాక్ట్ చేస్తోంది. జస్ట్ లుక్ హెర్ వన్స్.!
