Naga Shaurya.. ‘నా లవర్‌ని నేను కొడితే, నాకొచ్చిన ఇబ్బందేంటి.?’ అంటూ ఓ ప్రేమికుడు ఏకంగా సినీ నటుడు నాగ శౌర్యనే ప్రశ్నించేశాడు.
దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అయ్యింది. రోడ్డు మీద ఏదో గలాటా జరుగుతోందని తెలిసి, అటుగా వెళుతున్న నాగ శౌర్య కారులోంచి కిందికి దిగాడు.
అక్కడేమో, ఓ ప్రేమికుడు.. తన ప్రియురాల్ని.. అందరూ చూస్తుండగానే చెంప దెబ్బ కొట్టాడు. పాపం, ఆ ప్రియురాలు ఒకింత అవమానపడింది, బాధకు గురయ్యింది.
Naga Shaurya క్షమాపణ చెప్తావా.? లేదా.?
అందరి ముందూ ఓ ఆడ పిల్లని కొడతావా.? అంటూ యంగ్ హీరో నాగ శౌర్య, ఆ యువకుడ్ని నిలదీశాడు. కానీ, ఆ ప్రేమికుడు అప్పటికే మంచి కాక మీదున్నాడేమో, ‘నువ్వెవరు నన్ను అడగడానికి.?’ అంటూ రెచ్చిపోయాడు.
ఏం రోడ్డు మీదనైతేనేం.! లవర్‌ని కొట్టే హక్కు కూడా లేదా అధ్యక్షా.?
రోడ్ల మీద బరితెగిస్తున్న ప్రేమికులు.!
పబ్లిక్ న్యూసెన్స్‌పై నాగ శౌర్య గుస్సా.!
బాధితురాలికి క్షమాపణ చెప్పాలంటూ నాగ శౌర్య డిమాండ్.!
నా లవర్‌ని నేను కొడితే నీకేంటి నొప్పంటూ.. నాగ శౌర్యపై తిరగబడిన ప్రేమికుడు.!
నాగ శౌర్యకి హేట్సాఫ్ అంటున్నారు.. ట్రోల్ చేస్తున్నారు కూడా.!
Mudra369
ఈ క్రమంలో నాగ శౌర్యకీ, ఆ యువకుడికీ వాగ్వివాదం జరిగింది. చిత్రంగా, ఆ ప్రియురాలు కూడా తన ప్రేమికుడికి మద్దతుగానే నిలిచింది. దాంతో, నాగ శౌర్య ఏం చేయడానికి లేకుండా పోయింది.
అందరూ తిట్టిపోసినా..
నాగ శౌర్య మాత్రమే కాదు, అక్కడున్నోళ్ళంతా ఆ యువకుడ్ని తిట్టి పోశారు, అతన్ని తీసుకెళ్ళిపోయేందుకు ప్రయత్నించిన యువతి తీరునీ ఆక్షేపించారు.
Also Read: ఇదీ రామ్ చరణ్ విక్టరీ.! లెంపలేసుకో యండమూరీ.!
హైద్రాబాద్‌లో జరిగిందీ ఘటన. అయితే, నాగ శౌర్య అనవసరంగా పబ్లిసిటీ స్టంట్ చేశాడంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అదే సమయంలో, ‘నాగ శౌర్యని ఈ విషయంలో అభినందించి తీరాల్సిందే..’ అంటూ ఇంకొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరి గోల వారిది.!