Ambassador Car New..చాలామందికి కారు ఓ స్టేటస్ సింబల్.! ఒకప్పుడు కారు అండే అంబాసిడర్ మాత్రమే.
ఔను, కారుకే బ్రాండ్ అంబాసిడర్.. ఈ అంబాసిడర్ కారు.! దాదాపు ఆరు దశాబ్దాలపాటు భారతదేశంలో అంబాసిడర్ కారు ఓ వెలుగు వెలిగింది.
కానీ, మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్ళ కార్ల ప్రవేశంతో, అంబాసిడర్ కారు అంటే చిన్న చూపు మొదలైంది. దాన్ని ట్యాక్సీగానూ, పాత డొక్కు కారుగానూ అభివర్ణించడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే అంబాసిడర్ కారులోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ, ఏం లాభం.? పాత డిజైన్ మాత్రం మారలేదు.
అందులో పీచర్లు మారినా, ఔట్ లుక్ ముఖ్యం కదా.? ఆ ఔట్ లుక్ మారకపోవడంతో అంబాసిడర్ కారు వైపు చూసేవాళ్ళే కరవయ్యారు.
కారు అంటే అదేనండోయ్.!
డిమాండ్ లేకపోవడంతో అంబాసిడర్ కార్ల తయారీ కూడా నిలిచిపోయింది. ఒకప్పుడు తయారైన అంబాసిడర్ కార్లు కొన్ని ఇప్పటికీ భారతదేశంలోని రోడ్ల మీద తిరుగుతూనే వుంటాయి.
వాటిని చూసినప్పడల్లా, ‘కారు అంటే ఇదీ..’ అని అనుకుంటుంటారు అంబాసిడర్ ప్రేమికులు.

ఆ కారుని మళ్ళీ ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు ఫ్రెంచ్ కంపెనీతో హిందూస్తాన్ మోటార్స్ సంస్థ సూచన ప్రాయంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Ambassador Car New.. కారుకి అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్.!
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ట్రెండ్ నడుస్తోన్న దరిమిలా, అంబాసిడర్ కారుని సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వంటివాటితో కాకుండా విద్యుత్ శక్తితో నడిచేలా డిజైన్ చేయబోతున్నారట.
ఇదే అంబాసిడర్ కొత్త మోడల్.. అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
Also Read: గుండె పోటు మాత్రమే.! ఇంకే ఇతర ‘పోటూ’ లేదట.!
కనిపిస్తున్న ఫొటో అదే. అచ్చం అలాగే అంబాసిడర్ కారు, మన మార్కెట్లోకి వస్తే.. మళ్ళీ అంబాసిడర్ కారు తన రాజసాన్ని నిలబెట్టుకుంటుందన్నది నిర్వివాదాంశం. కానీ, ఇందుకు ఎంత సమయం పడుతుందో ఏమో.!