Table of Contents
F 35 Kerala India.. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానమట.! ఆ యుద్ధ విమానం గాల్లో చేసే విన్యాసాల్ని, ఇంకే యుద్ధ విమానమూ చేయలేదట.!
అరరె.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయి కూడా, ఆ యుద్ధ విమానం సాంకేతిక సమస్యతో ఇరుక్కుపోవడమేంటి.?
ఔను, ఇరుక్కుపోయింది.! ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి గాల్లోకి లేచిందిగానీ, తిరిగి అదే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దిగలేకపోయింది.
యూకే నేవీ (రాయల్ నేవీ)కి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం గురించే ఇదంతా.! కేరళలో వుందిప్పుడు అది.
F 35 Kerala India.. అలా ఎలా ఇరుక్కుపోయింది చెప్మా.?
మామూలుగా అయితే, ఓ దేశ యుద్ధ విమానం, ఇంకో దేశంలో.. ఇన్ని రోజులు ఇరుక్కుపోవడం జరగదు. ఈ ఎఫ్-35 విషయంలోనే ఇలా జరిగింది.
ఇదే రకం యుద్ధ విమానాల్ని అమెరికా, భారత దేశానికి విక్రయించాలనుకుంటోంది. మనమేమో, దీనికంటే బెటర్ ఆప్షన్ దిశగా సమాలోచనలు చేస్తున్నాం.
సాంకేతిక సమస్య వచ్చింది సరే, దాన్ని పరిష్కరించడానికి నిపుణులు రావాలి కదా.? ప్చ్, రావట్లేదు. ఇంకోపక్క, ఎఫ్-35 యుద్ధ విమానాన్ని తీసుకొచ్చిన పైలట్‌కి సపర్యలు చేయాల్సి వస్తోందిక్కడ.
యుద్ధ విమానాన్ని హ్యాంగర్‌కి కూడా తరలించడానికి వీల్లేకుండా పోయింది. అందుకు, పైలట్ ఒప్పుకోవడంలేదు. హ్యాంగర్‌లోకి వెళితే, అక్కడ దాన్ని ఏమైనా మన నిపుణులు చేస్తారేమోనన్నది పైలట్ భయం.
రివర్స్ ఇంజినీరింగ్ చేయలేమా.?
చైనా అయితే, ఇలాంటి సందర్భాల్లో ‘నక్క’ తెలివి ప్రదర్శిస్తుంటుంది.. రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి, డిజైన్‌ని కాపీ కొట్టేయడం చైనాకి వెన్నతో పెట్టిన విద్య.
అందుకే, అలాంటిదేమన్నా ఇక్కడ జరుగుతుందేమోనని, కేరళలో ఎఫ్-35 యుద్ధ విమానాన్ని అత్యవసరంగా దించిన పైలట్ ఆందోళన చెందుతున్నాడు.
పది రోజులకు పైగా, విదేశీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్.. ఇలా కేరళలో నిలిచిపోవడంతో, సహజంగానే భారతదేశంలో ఈ అంశంపై హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బోల్డన్ని సెటైర్లూ పడుతున్నాయి.
అసలెలా రాడార్ క్రాస్ ఓవర్ అయినట్లు.?
యుద్ధ రంగాన ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యం తెలిసినవారు, ఎఫ్-35 కేరళలో అత్యవసర ల్యాండింగ్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
Also Read: టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ: ‘అక్రమ వలస’ని ఎలా ఒప్పుకుంటాం.?
మరోపక్క, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్.. భారత రాడార్లకు ఎలా చిక్కిందన్నది ఇంకో ఆసక్తికరమైన అంశం. స్టెల్త్.. అంటే, రాడార్లకు చిక్కనిది. చిక్కనిది, చిక్కేసిందంటే.. ఎఫ్-35 లూప్ హోల్స్ బయట పడినట్లే కదా.?
ఇదిలా వుంటే, భారత దేశం తన ఆయుధ సంపత్తిని పెంచుకునే క్రమంలో స్టెల్త్ కేటగిరీలోనే అత్యాధునిక యుద్ధ విమాన తయారీకి సంకల్పించిన సంగతి తెలిసిందే.