Ambati Rayudu Cricket Bat.. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారాడు.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరాడాయన.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం షురూ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఔత్సాహిక క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.
అధికార వైసీపీ రంగులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోలతో కూడిన క్రీడా పరికరాల్ని అందుబాటులోకి తెచ్చారు.
పెద్ద సంఖ్యలో ఔత్సాహిక క్రీడాకారులు ఈ కార్యక్రమం కోసం రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు. క్రీడలు మొదలయ్యాయ్. పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్ షురూ అయ్యింది. రాజకీయ విమర్శలూ మామూలే.
Ambati Rayudu Cricket Bat.. నాణ్యతా లోపాల సంగతేంటి.?
క్రికెట్ బ్యాట్లు విరిగిపోతున్నాయ్.! ఇదీ ప్రధాన ఆరోపణ. బ్యాట్ అన్నాక విరగకుండా వుంటుందా.? కానీ, ఒకట్రెండు మ్యాచ్‌లకే విరిగిపోతే ఎలా.? అదే అసలు సమస్య.
అంబటి రాయుడు వైసీపీ నేత కదా, పైగా మాజీ క్రికెటర్ కూడా. ఆయన రంగంలోకి దిగాడు. ‘గట్టిగా కొడితే బ్యాట్లు విరుగుతాయ్’ అని చెప్పాడు.
ఇది ఓ రకంగా, రాజకీయ విమర్శలు చేస్తున్నవారిపై కౌంటర్ ఎటాక్.! క్రికెట్‌లో కూడా వ్యూహాత్మకంగానే కౌంటర్ ఎటాక్ చేయాలి. లేకపోతే, యార్కర్‌కో లేదంటే బౌన్సర్‌కో బలైపోవాల్సి వస్తుంది.
బ్యాట్ ఎందుకు విరుగుతుందంటే.?
ఆట సరిగ్గా రాకపోవడంతో ఇష్టమొచ్చినట్లు ‘రాంగ్ షాట్స్’ కొడితే, బ్యాట్ త్వరగా విరిగిపోయేందుకు ఆస్కారం వుంటుంది. క్రికెటర్‌గా అంబటి రాయుడికి ఇది తెలియదని ఎలా అనుకోగలం.?
రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో తాను పూర్వాశ్రమంలో క్రికెటర్‌నన్న లాజిక్కుని మర్చిపోయాడు అంబటి రాయుడు.
ఒకవేళ తాను గతంలో క్రికెట్ ఆడిన విషయం అంబటి రాయుడికి గుర్తుంటే, ఆ సోయతో మాట్లాడి వుంటే, ఆయన నోట్లోంచి ‘గట్టిగా కొడితే బ్యాట్ విరిగిపోతుంది’ అనే మాట వచ్చి వుండేది కాదు.!
Also Read: సామి చెప్పిండు.! ఓ పదిహేనేళ్ళు ఎన్నికలు మానేయిండ్రి.!
నాణ్యతా లోపాలు వున్నాయా.? లేవా.? అన్నదానిపై విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గు తేలుతాయ్.! అది మానేసి, రాజకీయ విమర్శలపై ఇలా సగం మెదడుతో కౌంటర్ ఎటాక్ ఇస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేటంటి.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
చివరగా.. మూడు రాజధానులతోనే రాష్ట్ర అభివృద్ధి అనీ, మద్యం ధరల్ని పెంచితే.. మద్యపానం తగ్గుతుందనీ, తెలుగు మాద్యమాన్ని తొలగిస్తేనే చదువు బాగా అబ్బుతుందనీ.. ఇప్పుడేమో, గట్టిగా కొడితే బ్యాట్ విరిగిపోతుందనీ.. ఇలాంటి బుకాయింపులు వైసీపీకే ఎందుకొస్తాయో ఏమో.!