Ambati Rayudu Janasenani Pawankalyan.. అదేంటీ, మొన్నే కదా వైసీపీలో చేరాడు.. నిన్నే కదా, ఆ పార్టీకి రాజీనామా చేశాడు.?
పట్టుమని పదిహేను రోజులు కూడా వైసీపీలో అంబటి రాయుడు (Ambati Rayudu) ప్రయాణం ఎందుకు సజావుగా సాగలేకపోయింది.?
ఏమోగానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో (Jana Sena Party Chief Pawan Kalyan) అంబటి రాయుడు భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.
అప్పుడే అంబటి రాయుడిని కూడా ప్యాకేజీ స్టార్.. అనేస్తోంది వైసీపీ.! ఎంతలో ఎంత మార్పు.? నానా రకాలుగా అంబటి రాయుడిని వైసీపీ తూలనాడుతోంది. ఇదీ వైసీపీ మార్కు పైత్యం.
Ambati Rayudu Janasenani Pawankalyan జనసేనలో చేరలేదుగానీ..
జనసేన పార్టీలో అంబటి రాయుడు ఇంకా చేరలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచన మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు కలిశాడంతే.
ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వద్దామనుకున్న అంబటి రాయుడికి, వైసీపీలో షాక్ తగిలింది. తన ఆలోచనలకీ, వైసీపీ తీరుకీ అస్సలు పొసగడంలేదని తెలుసుకుని, వైసీపీ నుంచి బయటకు వచ్చేశాడు.
సరే, ఎన్నికల్లో పోటీ చేయడానికి 140 కోట్లు అవసరమని వైసీపీ చెప్పిన దరిమిలా, ఆ మాటల్ని భరించలేక వైసీపీకి అంబటి రాజీనామా చేశాడన్న ప్రచారంలో నిజమెంత.? అన్నది వేరే చర్చ.
ఒకే తరహా ఆలోచనలు..
‘పవన్ అన్నతో చర్చించాను. నా ఆలోచనలు పంచుకున్నాను. ఇద్దరివీ ఒకే తరహా ఆలోచనలు..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం ట్వీటేశాడు అంబటి రాయుడు.
త్వరలో దుబాయ్‌లో క్రికెట్ ఆడనున్న దరిమిలా, అప్పటివరకు అంబటి రాయుడి (Ambati Rayudu) నుంచి రాజకీయ ప్రకటన ఏదీ వచ్చే అవకాశం లేదు.
Also Read: సందీప్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి.!
జనసేనాని పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు కాబట్టి, జనసేనలో చేరిపోతాడనీ, వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తాడనీ ఇప్పుడే అనుకోవడం తొందరపాటు అవుతుంది.
జనసేన వైపుగా ప్రారంభమైన అంబటి రాయుడు ప్రయాణం, మధ్యలో సైడ్ టర్న్ తీసుకోవచ్చు.. లేదా యూ టర్న్ కూడా తీసుకోవచ్చు.