Ambati Rayudu Political Wicket.. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి.! వచ్చి తీరాలి.! ఫక్తు రాజకీయాల్ని సవాల్ చేస్తూ, మార్పు కోసం యువత నడుం బిగించాలి.
సమాజంపై ప్రభావం చూపగల ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి, ఆ రాజకీయాల్లో మంచిని పెంచాలి.! చెప్పుకోడానికి ఈ మాటలు ఎంత బావున్నాయో కదా.!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.! ఇదీ రాజకీయం అంటే.! ఎవడన్నా రాజకీయాల్లోకి వస్తున్నాడంటే చాలు, అత్యంత జుగుప్సాకరమైన ట్రోలింగ్.!
Ambati Rayudu Political Wicket.. అంబటి రాయుడు.. ఎందుకిలా చేశాడు.?
అంబటి రాయుడు.. ఒకప్పుడు ప్రముఖ క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్‌కి కొన్నాళ్ళ క్రితం గుడ్ బై చెప్పేశాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల ప్రకటించాడు.
కొద్ది రోజుల క్రితమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంబటి రాయుడు. ఏమయ్యిందోగానీ, కొద్ది రోజులకే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించేశాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు అంబటి రాయుడు చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మంచి నిర్ణయమే..
అంబటి రాయుడు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. కానీ, మంచి రాజకీయ వేదిక అవసరం.! ఈ విషయంలో అంబటి రాయుడు తొందరపడ్డాడు, తొందరగానే తప్పు తెలుసుకున్నాడు కూడా.!
ఇది చాలామంది అభిమానుల అభిప్రాయం.! క్రికెట్ బాగా ఆడితే బ్యాటు విరిగిపోతుందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పి, ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు అంబటి రాయుడు.
వైసీపీలో చేరాడు కాబట్టి, ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వానికి మద్దతుగా అలా మాట్లాడాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెటర్, బ్యాటు గురించి అంత తేలిగ్గా మాట్లాడటమేంటని అంతా విస్తుపోయారు.
క్రాస్ చెక్ చేసుకుని, తాను మాట్లాడింది తప్పని తెలుసుకున్నట్టున్నాడు. తాను చేరిన రాజకీయ వేదిక కూడా సరైంది కాదనే నిర్ణయానికి వచ్చినట్లున్నాడు.
Also Read : JSP TDP: వీళ్ళు కలిస్తే వాళ్ళెందుకు వణుకుతున్నారు.!
ఏ రాజకీయ వేదికా నచ్చకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా అయినా రాజకీయాల్లోకి రావొచ్చు. వచ్చి నిలబడే సత్తా అంబటి రాయుడికి వుంది.!
రాజకీయమంటే సేవ.! ఆ సేవా మార్గానికి గుడ్ బై చెప్పకుండా, ఏదో ఒక రకంగా రాజకీయాల్లో అంబటి రాయుడు వుండాలనే ఆశిద్దాం.!