బాలయ్యనే మెప్పించాడు.! విశ్వక్ సేన్ మామూలోడు కాదు.!
Nandamuri Balakrishna Vishwak Sen
Nandamuri Balakrishna With Vishwaksen.. బాలయ్యని మెప్పించడమంటే మాటలా.? బాలయ్యతో కలిసి సినిమా చేయడమంటే మాటలా.? విశ్వక్ సేన్ నిజంగానే మామూలోడు కాదు.!
జూనియర్ ఎన్టీయార్‌తో ఓ సినిమా చేయాలని వుందంటూ గతంలో ప్రకటించిన విశ్వక్ సేన్ (Vishwak Sen), ఇప్పడు బాలయ్యతో సినిమాకి రెడీ అయిపోయాడు.
విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ సందడి చేసిన సంగతి తెలిసిందే.
Nandamuri Balakrishna With Vishwaksen.. ఇద్దరం ఒకేలా వుంటాం…
‘నేనూ విశ్వక్ సేన్ ఒకేలా వుంటాం..’ అంటూ బాలయ్య (Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్య, విశ్వక్ సేన్‌కి ఓ ‘అవార్డు’ లాంటిదని చెప్పొచ్చు. బాలయ్యకి విశ్వక్ సేన్ వీరాభిమాని.

అంతేనా, జూనియర్ ఎన్టీయార్‌కి (Jr NTR) కూడా విశ్వక్ సేన్ వీరాభిమాని. మాస్ కా దాస్.. విశ్వక్ సేన్, కెరీర్‌లో అంచలంచెలుగా ఎదుగుగుతున్నాడు.
నటుడు మాత్రమే కాదు, దర్శకుడు అలాగే నిర్మాత కూడా అయిన విశ్వక్ సేన్ (Vishwak Sen), అతి త్వరలో బాలయ్యతో కలిసి నటించబోతున్నాడు.
ఈ ఇద్దరి ‘మాస్’ కాంబినేషన్..
‘మేమిద్దరం కలిసి నటించబోయే సినిమాకి సంబంధించి త్వరలోనే అనౌన్స్‌మెంట్ రాబోతోంది..’ అంటూ స్వయంగా నందమూరి బాలకృష్ణ, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు.
ఇంతకన్నా, విశ్వక్ సేన్‌కి (Vishwak Sen) కావాల్సిందేముంటుంది.? నిజంగానే, ఈ విషయంలో విశ్వక్ సేన్ చాలా చాలా అదృష్టవంతుడని చెప్పక తప్పదు.
Also Read: బుట్ట బొమ్మ.. పూజా హెగ్దే ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మాస్ హిస్టీరియాకి కేరాఫ్ అడ్రస్ అయిన బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులకి ఆల్రెడీ ‘సొంత మనిషి’ అయిపోయాడు.
ఇప్పుడిక ఈ ఇద్దరూ తెరపై కలిసి కనిపిస్తే, ఆ అభిమానులకి లభించే కిక్ ఏ రేంజ్‌లో వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.