Amy Jackson Marriage.. పెళ్ళంటే అసలిష్టం లేదు.. అయినా, పెళ్ళితో పనేంటి.? అని ప్రశ్నించింది ఒకప్పుడు నటి అమీ జాక్సన్.!
అమీ జాక్సన్ తెలుసు కదా.? తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో నటించింది.! విక్రమ్ సరసన ‘ఐ’ సినిమాలోనూ ఈ బ్యూటీ నటించింది.
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన అమీ జాక్సన్, ప్రస్తుతం లండన్‌లో వుంటోంది.! ఆమెకు ప్రస్తుతం ఐదేళ్ళ వయసున్న ఓ కొడుకున్నాడు.
Amy Jackson Marriage.. పదహారేళ్ళకే..
మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చింది అమీ జాక్సన్. ఆమె బ్రిటిష్ మోడల్.! 1992 జనవరి 31న జన్మించింది అమీ జాక్సన్. మిస్ టీన్ వరల్డ్‌గా అందాల కిరీటం కూడా అందుకుందామె.
మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో అమీ జాక్సన్ రన్నరప్‌గా మారింది. పలు ఇతర అందాల పోటీల్లోనూ సత్తా చాటింది.

పదహారేళ్ళకే మోడలింగ్ రంగం, ఆ తర్వాత సినిమాల్లోకి.. ఇలా సాగింది అమీ జాక్సన్ ప్రయాణం.ఇండియన్ సినిమా తెరపై కొన్నాళ్ళపాటు ఓ వెలుగు వెలిగింది అమీ జాక్సన్.
‘మదరాసిపట్టినం’ సినిమా ఆమెకు నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
కాగా, శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ఐ’ సినిమా కోసం అమీ జాక్సన్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం గమనార్హం. ‘రోబో-2’లోనూ అమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.
ఎఫైర్లు..
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో ‘ఏక్ దివానా థా’ సినిమాలో నటించింది అమీ జాక్సన్. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు.
ప్రతీక్ బబ్బర్‌తో పీకల్లోతు ప్రేమాయణం నడిపిన అమీ జాక్సన్, అతన్ని పెళ్ళాడాలనుకుందిగానీ, కుదరలేదు.

ఆ తర్వాత కొన్నేళ్ళకు, లండన్‌లో ప్రముఖ వ్యాపారవేత్త తనయుడైన జార్జి పనాయుటుతో ప్రేమలో పడింది. వీరిద్దరికీ ఓ కొడుకు జన్మించాడు.
Also Read: టాలీవుడ్ ‘పల్స్’ పట్టేసిన భాగ్యశ్రీ.!
కానీ, కొన్నాళ్ళ తర్వాత జార్జి పనాయిటుతో బ్రేకప్ అయిపోయింది అమీ జాక్సన్‌కి. ఆ తర్వాత, ఇంగ్లీష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో అమీ జాక్సన్ ప్రేమాయణం షురూ అయ్యింది.

తామిద్దరం పెళ్ళి చేసుకుంటున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేసింది అమీ జాక్సన్ (Amy Jackson).
ప్రస్తుతం సినిమాలకు దూరంగా వున్నా, సోషల్ మీడియాలో మాత్రం అమీ జాక్సన్ యాక్టివ్‌గానే వుంది.