Anannya Nagalla Tollywood Support.. తమిళ సినీ పరిశ్రమలో, ఓ జర్నలిస్ట్ సంధించిన ప్రశ్న, ఆ ప్రశ్నని ఎదుర్కొన్న నటికే కాదు, మొత్తంగా తమిళ సినీ పరిశ్రమకి ఆగ్రహం తెప్పింది.
ఆ నటి గౌరీ కిషన్.! తెలుగులోనూ నటించిందీమె. మొత్తం తమిళ సినీ పరిశ్రమ, గౌరి కిషన్‌కి అండగా నిలిచింది. తమిళ మీడియా కూడా ఆమెకు బాసటగా నిలిచింది.
ప్రెస్ క్లబ్ తరఫున, సదరు జర్నలిస్టు తీరుని ఖండిస్తూ ఓ ఖండన ప్రకటన కూడా వచ్చింది. కానీ, తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి వాతావరణం లేదు.
కొన్నాళ్ళ క్రితం అనన్య నాగళ్ళని ‘కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్’ విషయాలపై గుచ్చి గుచ్చి ప్రశ్నించింది ఓ జర్నలిస్ట్. ఆ ప్రశ్నకు, అనన్య నాగళ్ళ చాలా బాధపడింది.
Anannya Nagalla Tollywood Support.. అనన్యకి దక్కని మద్దతు..
కానీ, పరిశ్రమ నుంచి ఎవరూ అనన్య నాగళ్ళకి మద్దతుగా నిలబడలేదు. తెరవెనుక ఆ వివాదం ‘సెటిల్’ అయిపోయింది. అదే జర్నలిస్ట్, పదే పదే సినీ జనాల్ని టార్గెట్ చేస్తూనే వుంది.
మొన్నీమధ్యన మంచు లక్ష్మికి, ఓ జర్నలిస్ట్ సంధించిన ప్రశ్న కూడా వివాదాస్పదమయ్యింది. మంచు లక్ష్మీ, సీరియస్‌గా తీసుకోవడంతో, ఆ జర్నలిస్ట్ క్షమాపణ చెప్పాడు.
కానీ, పదే పదే అతని తీరు అలానే వుంది. అనన్య నాగళ్ళ విషయంలో టాలీవుడ్ ప్రముఖులు స్పందించి వుంటే, తెలుగు సినీ పరిశ్రమపై మీడియా ముసుగులో విషం చిమ్మే ప్రయత్నాలు ఆగుతాయి.
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
అంతెందుకు, ఓ నిర్మాత తన సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఓ వేదికపై ఆవేదన వ్యక్తం చేస్తే, ఆ నిర్మాతతో క్షమాపణ చెప్పించుకుంది ఓ తెలుగు సినీ మీడియా సంస్థ.
ఇంత దారుణమైన పరిస్థితుల్ని కొందరు సినీ ప్రముఖులు తెలుగు సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్నారు. తమిళ సినీ పరిశ్రమకి వున్న తెగువ, తెలుగు సినీ పరిశ్రమకి ఎందుకు లేకుండా పోయింది.?
