Ananya Nagalla Glamour Tantra.. అందానికి అందం, అభినయానికి అభినయం.. పదహారణాల తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ల. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది.
ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ తదితర చిత్రాల్లో నటించింది. ‘శాకుంతలం’ సినిమాలో సమంతకు స్నేహితురాలిగానూ నటించి మెప్పించింది అనన్య నాగళ్ళ.
సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేదు కానీ, మంచి టాలెంట్ వున్న నటి అనన్య నాగళ్ల. గ్లామర్‌లోనూ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదీ ముద్దుగుమ్మ.
Ananya Nagalla Glamour Tantra.. అందాల వశీకరణం అనన్యమే.!
సోషల్ మీడియాలో అందాల పోజులతో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. అనన్య గ్లామర్ పోజులకు నెట్టింట బోలెడంత క్రేజ్ వుంది.
ఆ సంగతి అటుంచితే, తాజాగా అనన్య నాగళ్ల ఓ హారర్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇంతకీ ఏంటా సినిమా.? సినిమా పేరు ‘తంత్ర’. క్షుద్ర పూజల నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ఈ మధ్య ‘విరూపాక్ష’ తదితర సినిమాలు ఇదే ఫార్ములాతో వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే.
అందులోనూ అనన్య నో కాంప్రమైజ్.!
అదే నేపథ్యంలో ‘తంత్ర’ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది ప్రచార చిత్రాలు చూస్తుంటే. వశీకరణకు గురయిన అమ్మాయిగా ఈ సినిమాలో అనన్య నాగళ్ల కనిపించబోతోంది.

డిఫరెంట్ వేరియేషన్లలో తన టాలెంట్ చూపిస్తూనే, అవసరమైన మేర కొన్ని ఇంటిమేట్ సీన్లలోనూ అనన్య నటించినట్లు ట్రైలర్‌లో చూపించారు.
ఏది ఏమైతేనేం, ‘తంత్ర’ హిట్ అయ్యిందంటే తెలుగమ్మాయ్ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) దశ తిరిగినట్లే.! చూడాలి మరి.!