Ananya Nagalla Luck.. తెలుగమ్మాయ్ అనన్య నాగళ్లకి అదృష్టం పట్టినట్లే వుంది. చాలా కాలంగా టాలీవుడ్‌లో నటిగా కొనసాగుతోంది అనన్య నాగళ్ల.
కానీ, ‘పొట్టేల్’ సినిమాలో అనన్య పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయ్. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్‌కి ముందు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

అంతేకాదు, సినిమా ప్రమోషన్లలో అనన్య కూడా బాగా ప్రొజెక్ట్ అయ్యింది. అలాగే కొన్ని విమర్శలు, బాధాకరమైన ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వచ్చింది కూడా అనన్యకి.
ఓ లేడీ జర్నలిస్టు.. ఇంటర్వ్యూలో భాగంగా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడంతో అనన్య చాలా నొచ్చుకుంది. కానీ, చాలా హుందాగా ఆ ప్రశ్నల్ని ఎదుర్కొంది.
Ananya Nagalla Luck.. తెలుగమ్మాయా.! మజాకానా.!
తనదైన శైలిలో సదరు జర్నలిస్టుకు సమాధానమిచ్చి శభాష్ అనిపించుకుంది. అయితే ధియేటర్లలో ‘పొట్టేల్’ సినిమా అంతంత మాత్రం అనిపించుకున్నా.. ఓటీటీలో రిలీజ్ అయ్యాకా మంచి ఆదరణ దక్కించుకుంటోంది.

అనన్య పాత్రకు అభినందనలు దక్కుతున్నాయ్. ఎలాగూ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందులోనూ అనన్య పాత్ర చాలా మందికి నచ్చింది.
దాంతో ‘పొట్టేల్’ సినిమా సక్సెస్ అనన్య కెరీర్‌కి బాగా యూజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అనన్య నాగళ్ల నటించిన మరో చిత్రం కూడా రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
సర్‌ప్రైజింగ్ రోల్‌లో..
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అనే చిత్రంలో అనన్య నటించింది. ఈ సినిమాలో అనన్య పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా వుండబోతోందట.
ఇంతవరకూ అలాంటి పాత్రలో తాను కనిపించలేదనీ చాలా ఎగ్టైటింగ్‌గా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నానని అనన్య చెప్పుకొచ్చింది.

నటుడు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిన ఓ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాని రూపొందించారు.
Also Read: పుష్ప 2 ది రూల్ రివ్యూ: వైల్డ్ ఫైర్ కాదు, వరస్ట్ ఫైర్.!
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య సమయంలో సమాంతరంగా జరిగిన ఓ క్రైమ్‌ని బేస్ చేసుకుని చాలా ఇంటెన్స్‌గా ఈ సినిమా కథను తెరకెక్కించారట.
ఈ సినిమాతో అనన్య రేంజ్ ఇంకాస్త పెరుగుతుందని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు అనన్య నాగళ్ల.