రౌడీ ‘లైగర్’.. ఇది ఇంకో లెవల్.!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం టైటిల్ రివీల్ (Vijay Deverakonda Liger Sensation) అయ్యింది. అవుతూనే, ఇదొక సంచలనంగా మారింది. సెన్సేషనల్ అండ్ ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలంటే, ముందుగా ఆ సినిమా టైటిళ్ళకు ఓ ప్రత్యేకత వుంటుంది.
ఆ ప్రత్యేకత, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకీ చూపించాడు పూరి జగన్నాథ్. ‘లైగర్’ అనే టైటిల్ ఖరారు చేసిన చిత్ర బృందం, ఈ టైటిల్‌తో బీభత్సమైన రెస్పాన్స్ రాబట్టింది. ‘లైగర్’ పాన్ ఇండియా మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా వైరస్ దెబ్బ కొట్టిందిగానీ, లేకపోతే, ఈపాటికి ఈ ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తయిపోయి, ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. ఇక, సినిమా టైటిల్ రివీల్ అవగానే, రౌడీస్ ఓ రేంజ్‌లో తమ పవర్ చూపించేందుకు సిద్ధమయిపోయారు.
చాలామంది రౌడీలు (విజయ్ దేవరకొండ అభిమానులు) ‘లైగర్’ టైటిల్‌ని పర్మనెంట్ టాట్టూలుగా వేయించుకోవడం గమనార్హం. ఔను, ఇది ఇంకో లెవల్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవాలేమో. చాలా తక్కువ సినిమాలతో చాలా ఎక్కువ ఫాలోయింగ్ విజయ్ దేవరకొండ సంపాదించుకున్నాడంటే, అదంతా అతని ఆటిట్యూడ్ కారణంగానే.
ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. అలాగని, పెద్దలంటే గౌరవం లేదని కాదు. అది వేరే లెవల్. విజయ్ దేవరకొండని ఎవరితోనూ పోల్చలేం. సింగిల్ పీస్. అందుకే, అనూహ్యమైన స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు.
ఇక, ‘లైగర్’ విషయానికొస్తే, తొలుత ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకున్నారు. బాలీవుడ్‌ని దృష్టిలో పెట్టుకుని, టైటిల్ విషయంలో పునరాలోచనలో పడ్డాడు దర్శకుడు పూరి జగన్నాథ్. చివరికి ‘లైగర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. లైగర్ అంటే.. సింహం, పులి జాతుల్ని క్రాస్ బ్రీడింగ్ చేయడం, తద్వారా జన్మించిన కొత్త జంతువు పేరే లైగర్.
పెద్ద పులి తరహా భారీ కాయం.. సింహం తాలూకు రాజసం.. ఇవన్నీ లైగర్ సొంతం. ఏదో ఆషామాషీగా దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమాకి ‘లైగర్’ అని పేరు పెట్టేయలేదు. పైగా, ‘సాలా క్రాస్ బ్రీడ్’ అంటూ టైటిల్ కింద పేర్కొన్నారంటే.. సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్ అనేట్టుగా సినిమాలో ఏదో వుండే వుంటుంది.