Ananya Nagalla Rainbow Glamour.. ‘ఇంద్ర ధనుస్సు చీరకట్టి.. చంద్ర వదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందట.. సూర్యునికే కునుకొచ్చిందట..’
ఇది.. అలనాటి మేటి పాట అక్షరాలా ఎన్టీవోడి పాట. ఏంటిప్పుడు ఈ పాట ఎందుకు గుర్తొచ్చిందంటారా.?
ఫోటోల్లో చూస్తున్నారుగా నేటి అందాల భామ.. అచ్చమైన తెలుగు చందమామ అనన్య నాగళ్ల కట్టిన చీర చూస్తే.. ఇంద్ర ధనుస్సు గుర్తుకు రావడం లేదూ.!
ఆ ఇంద్ర ధనుస్సునే ఈ ముద్దుగుమ్మ చీరగా మలిచేసి చుట్టేసుకున్నట్లు లేదూ. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అలాగే వుందంటున్నారు అనన్యను అమితంగా అభిమానించే నెటిజనం.
Ananya Nagalla Rainbow Glamour.. అంతిష్గం అనన్యకు సినిమాలంటే..
సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళకి స్పెషల్ ఫాలోయింగ్ వుంది. మరి వుండదా.!
సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కెరీర్ స్టార్ట్ చేసి.. సినీ రంగంపై వున్న అభిమానంతో సాప్ట్‌వేర్ వుద్యోగానికే టాటా బై బై చెప్పేసి సినిమాల్లోకి వచ్చేసింది.

మంచి పొటెన్షియల్ వున్న నటి. అయితే, దురదృష్టం ఏంటంటే.. పదహారణాల తెలుగమ్మాయ్ కావడమేనేమో. అరుదుగా మాత్రమే అవకాశాలొస్తున్నాయ్.
తొలి సినిమా ‘మల్లేశం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్యకు, రీసెంట్‌గా ‘పొట్టేల్’ సినిమా బాగా పాపులారిటీ తెచ్చి పెట్టింది.
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
అంతేకాదు, ఈ సినిమాలో అనన్య పాత్రకుగానూ తెలంగాణా ప్రభుత్వం గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డునిచ్చి సత్కరించింది.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, తెలుగుదనానికీ.. అందమైన చీరకట్టుకీ విడదీయరాని గ్లామరస్ బంధం వుంది. ఆ మాటకొస్తే, చక్కనమ్మ ఏం చేసినా అందమేననుకోండి.. అది వేరే సంగతి.
