Ananya Nagalla Sogasari Mudra పదహారణాల తెలుగందం. నవ్వితే నవరత్నాలు రాల.. అనేంత అందమైన నవ్వు ఆమె సొంతం. తెలుగమ్మాయిలకు అవకాశాలు అరుదే. కానీ, ఎలాగైనా తమ టాలెంటును ప్రూవ్ చేసుకుంటారు తెలుగమ్మాయిలు.
‘మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla). తొలి సినిమాతోనే సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకుంది.
నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ (Play Back Telugu Movie) సినిమాలో తనదైన నేచురల్ నటనతో ప్రేక్షకుల్నికట్టిపడేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమా అనన్యకు బంపర్ ఆఫర్ అనడం నిస్సందేహం.
అలా వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. అలాగే, సమంత లీడ్ రోల్ పోషిస్తున్న ‘శాకుంతలం’ (Samanha Ruth Prabhu Shakuntalam) సినిమాలో అనన్య ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
Ananya Nagalla Sogasari Mudra.. నో డౌట్.. ‘లోటు’ లేని గ్లామర్..
తెలుగమ్మాయ్ కదా.. అని గ్లామర్ పాళ్లు తక్కువనుకునేరు. కావల్సినంత గ్లామర్ ఒలకబోయగలదు.
సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే ఎలాంటి గ్లామర్ షో కైనా సిద్ధమే అని నెట్టింట గ్లామర్ పిక్స్‌తో ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతుంటుంది అందాల అనన్య నాగళ్ళ (Ananya Nagalla).

ఆ సంకేతాలకేనేమో, నెట్టింట అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ వుంది. స్టైలిష్ అండ్ కిల్లింగ్ లుక్స్‌తో నెటిజనాలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటుంది.
స్టైలింగ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటోందీ బ్యూటీ. ట్రెడిషనల్ అయినా, మోడ్రన్ అయినా ఏదైనా నాకు ఓకే అంటుంది హాట్ హాట్ అనన్య నాగళ్ల.
Also Read: సమంత అందాల దాడి.! ఊ అంటారా.. ‘నో’ అనగలరా.!
అన్నట్టు, తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినీ పరిశ్రమల నుంచీ అనన్యకు పిలుపులొస్తున్నాయట. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే తెలుగమ్మాయిల్ని తెలుగు సినిమా కంటే, తమిళ సినిమా ఎక్కువగా ఆదరిస్తుందండోయ్.!