Ananya Panday Allu Arjun.. ‘లైగర్’ బ్యూటీ తెలుసు కదా.? అదేనండీ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.! ఇప్పుడు ఆ ‘లైగర్’ బ్యూటీని, ఇంకోసారి తెలుగు సినీ పరిశ్రమకు తీసుకొస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైగర్’. అప్పట్లో, ఈ సినిమాకి ప్రీ రిలీజ్ క్రియేట్ అయిన బజ్ అంతా ఇంతా కాదు.
అనన్య పాండేకి, తెలుగులో తొలి సినిమాతోనే విపరీతమైన స్టార్డమ్ వచ్చేస్తుందని అంతా అంచనాలు వేశారు. సినిమా ప్రమోషన్లలోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంది అనన్య అప్పట్లో.
Ananya Panday Allu Arjun.. ‘లైగర్’ దెబ్బ మామూలుగా కాదు..
కట్ చేస్తే, సినిమా రిజల్ట్ డిజాస్టర్. దాంతో, అప్పటిదాకా గోల్డెన్ లెగ్.. అనే అంచనాలున్న అనన్య పాండే, రాత్రికి రాత్రి ఐరన్ లెగ్ అయిపోయింది.
‘లైగర్’ రిజల్ట్ దెబ్బకి, ఆమెతో సినిమాలు చేయాలనుకున్న కొందరు యంగ్ హీరోలు ఆ తర్వాత వెనకడుగు వేసేశారు. దర్శక నిర్మాతలెవరూ, అనన్యతో సినిమాలు చేసేందుకు సాహసించలేదు.

అసలు విషయానికొస్తే, అల్లు అర్జున్ సరసన అనన్య పాండేని హీరోయిన్గా ఖరారు చేశారంటూ ఓ గాసిప్ గుప్పుమంటోంది టాలీవుడ్ వర్గాల్లో.
Also Read: కళ్ళతో మాట్లాడగలిగితే.. రండి, నాతో మాట్లాడండి.!
ప్రస్తుతానికైతే ఈ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టతా లభించడంలేదు. కానీ, అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం బీభత్సమైన స్టార్ కాస్టింగ్ అయితే డిజైన్ చేస్తున్నారు.
ఆ లిస్టులో అనన్య పాండే పేరు వుంటుందా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓ సౌత్ బ్యూటీతోపాటు ఓ బాలీవుడ్ బ్యూటీ అల్లు అర్జున్‌తో ఆడి పాడబోతున్నారనీ, ఇంకో హీరోయిన్‌కీ ఛాన్స్ వుంటుందనీ అంటున్నారు.

తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు. ఇటీవల హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణులతో హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, విదేశాల్లో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి వుంది.