Anasuya Bharadwaj Against Sivaji.. బుల్లి తెర బ్యూటీ, సినీ నటి అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది తాజాగా.! అదీ, ‘ఇది నా శరీరం.. మీది కాదు’ అని పేర్కొంటూ.!
సినీ నటుడు శివాజీ, మహిళల వస్త్రధారణపై చేసిన దిగజారుడు వ్యాఖ్యల నేపథ్యంలో, అనసూయ భరద్వాజ్ ఎక్కడా శివాజీ పేరు ప్రస్తావించకుండా వేసిన ట్వీటు సారాంశమిది.
విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతోందంటే, అనసూయ భరద్వాజ్ నుంచి ఏదో ఒక ట్వీట్ పడుతుంటుంది.. అతన్ని టార్గెట్ చేస్తూ. అది వేరే సంగతి.
Anasuya Bharadwaj Against Sivaji.. అనసూయ పోస్ట్ వెనుక..
అనసూయ, ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్.. ఓ ఇమేజ్‌కి సంబంధించినది. అందులో మహిళలు భిన్న వస్త్రధారణోల కనిపిస్తున్నారు. అదొక ఆర్ట్. దాంట్లోనే, ‘It’s My Body Not Yours’ అని ప్రస్తావించబడింది.
సరే, అదే నిజమని అనుకుందాం.! మరి, నటీమణులు ఎందుకు తమ శరీరాల్ని ప్రదర్శనకు పెడతారు.? సినిమా కదా, సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం కదా.! తప్పదు.!
అందం చూడవయా.. ఆనందించవయా.. అంటాడో కవి.! కేవలం ఆనందించి ఊరుకోరు కదా అందరూ.! కొందరు, ఏదో ఒక కామెంట్ చేస్తారు.
ఇది సోషల్ మీడియా యుగం. ఎవడికి నచ్చింది వాడు కామెంట్ చేసుకుంటూ వెళతాడు. అనసూయ కూడా, అలానే కదా.. ఈ పోస్ట్ పెట్టింది.
ఇక్కడ చూస్తున్నారు కదా.. అనసూయ స్విమ్మింగ్ ఫొటోలు.! వెకేషన్ సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

‘ఇది నా శరీరం.. మీది కాదు..’ అనే ఆలోచన అనసూయకి, ఈ స్విమ్ సూట్ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినప్పుడు ఎందుకు రాలేదో.!
ఒక్కటి మాత్రం నిజం. శివాజీ మాట్లాడిన మాటలు నూటికి నూరు పాళ్ళూ తప్పే.! తప్పు కాదు, నేరం.! తగిన శిక్ష పడాలి కూడా.!
‘దరిద్రపు ముండలు’ అని ఆయన అని వుండకూడదు మహిళల్ని ఉద్దేశించి. మహిళల శరీర భాగాల్ని సామాన్లు.. అని అభివర్ణించకూడదు కూడా.
శివాజీ చేసింది తప్పే.! అదే సమయంలో, ‘ఇది నా శరీరం.. మీది కాదు’ అని బలంగా నమ్మితే, గ్లామర్ పేరుతో అనసూయ అందాల ఆరబోత కూడా సరికాదేమో.!
