Anasuya Bharadwaj Aunty.. పెళ్ళయ్యాక మగాడ్ని అంకుల్ అనడం.. ‘లేడీ’ని అయితే ‘ఆంటీ’ అనడం సర్వసాధారణమే.!
ఎద్దులా ఎదిగినోళ్ళు కూడా, పెళ్ళయినోళ్ళని ఉద్దేశించి ‘అంకుల్’, ‘ఆంటీ’ అనడం వింతేమీ కాదు.
సినిమా తారలు కదా.. పుసుక్కున ఎవరన్నా ఆంటీ అనో, అంకుల్ అనో పిలిస్తే.. ‘గ్లామర్’ తగ్గిపోతుందనే భావన వుంటుంది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నిజ జీవితంలో ‘తాతయ్య’ అయిపోయినాగానీ, తన కంటే వయసులో చాలా చిన్నవాళ్ళయిన హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేస్తుంటారు.
సోషల్ మీడియా మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం.. ఒకటే ధోరణి.!
ఒకర్ని మించి ఇంకొకరు.! తారలూ కొన్నిసార్లు పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటారు.!
కామెడీ షోస్ పేరుతో చేసే వెకిలి కామెడీ, సెలబ్రిటీల స్థాయిని తగ్గిస్తోందన్నదీ నిర్వివాదాంశం.!
చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏంటి ప్రయోజనం.?వెకిలితనాన్ని ప్రోత్సహించి, ఆ తర్వాత ఆ వెకిలితనానికి బాధితులుగా మారిపోయి గగ్గోలు పెట్టడమెందుకు.?
Mudra369
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనను ‘బాలా’ అని పిలవాలంటూ సూచిస్తుంటారు. యంగ్ హీరోలతో అయినా, సీనియర్ హీరోయిన్లతో అయినా ‘బాలా’ అని పిలిపించుకుంటుంటారు బాలయ్య.
Anasuya Bharadwaj Aunty.. అనసూయ.. ఆంటీ.!
‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా పుణ్యమా అని అనసూయ (Anasuya Bharadwaj) పేరు కాస్తా ‘రంగమ్మత్త’ అయిపోయింది. ఆ సినిమాలోని ఆమె పాత్ర పేరు ‘రంగమ్మత్త’ మరి.!

సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా అనసూయ కాస్తా ‘అనసూయ (Anasuya Bharadwaj) ఆంటీ’గా మారిపోయిందనొచ్చేమో.
‘నన్ను ఆంటీ అంటారా.? మీ మీద కేసులు పెడతా..’ అంటూ అనసూయ హెచ్చరికలు జారీ చేశాక, ఆ పైత్యం మరింత ముదిరింది.
ఏమనుకుందోగానీ, ‘ఇప్పుడు అలా ఎవరైనా తనను ఆంటీ.. అని పిలస్తే, కోపం రావడంలేదు’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.!
కోపమెందుకు చెప్మా.?
ఇందులో కోపగించుకోవడానికేముంది.? సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌ని ఎవరూ ఆపలేరు. ఇదైతే ఫిక్స్.! కేసులు, అరెస్టులు.. ఎంతమంది విషయంలో జరుగుతాయ్.?
Also Read: నిజాయితీగా వున్నా విడాకులొచ్చాయ్: సమంత వైరల్ కామెంట్స్
ఈ ‘వాస్తవం’ తెలుసుకుంది కాబట్టే, అనసూయ (Anasuya Bharadwaj) ‘ఇకపై కోపగించుకోకూడదు’ అనే నిర్ణయానికి వచ్చినట్టుంది ‘ఆంటీ’ వ్యాఖ్యలపై.
గుడ్ డెసిషన్.. కీపిటప్.. అనాల్సిందే. ఎందుకంటే, ఆకతాయిలతో వాదులాడటంలో అర్థం లేదు మరి.!