Anasuya Bharadwaj Sorry Raasi.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.! తప్పు తెలుసుకోవడం మంచిదే.! క్షమాపణ చెప్పడమంటే, గౌరవాన్ని కాపాడుకున్నట్లే.!
పశ్చాత్తాపానికి మించిన ప్రాయిశ్చిత్తం ఏముంటుంది.? అసలు చేసిన పాపమేంటి.? ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.? క్షమాపణ ఎవరికి చెప్పారు.?
న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, బుల్లితెరపై యాంకర్‌గా రాణించి, ఇప్పుడు సినిమాల్లో రాణిస్తోన్న అనసూయ భరద్వాజ్ గురించే ఇదంతా.
అనసూయ భరద్వాజ్ క్షమాపణ చెప్పిందెవరికో తెలుసా.? సీనియర్ నటి రాశికి. ప్రస్తుతం రాశి సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు.!
కొన్నేళ్ళ క్రితం జబర్దస్త్ కామెడీ షో వేదికగా, అనసూయ భరద్వాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అది కూడా కామెడీ స్కిట్లో భాగమే.!
రాశి గారి ఫలాలు.. అంటూ, డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పింది అనసూయ. అప్పట్లోనే, ఆ అంశం వివాదాస్పదమయ్యింది. ఈ విషయమై తాజాగా రాశి, ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
రాశి వ్యాఖ్యల తాలూకు వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, అనసూయ భరద్వాజ్ క్షమాపణ చెబుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించడం గమనార్హం.
ఈ విషయంలో అనసూయ భరద్వాజ్‌ని అభినందించి తీరాలి. అనసూయతోపాటు, జబర్దస్త్ టీమ్ కూడా, రాశికి క్షమాపణ చెబితే మంచిది.!
అయితే, ఒక్కసారి కాదు.. అనసూయ సహా జబర్దస్త్ టీమ్ అంతా, ఒకటికి వంద సార్లు.. కాదు కాదు, వేల సార్లు.. లక్షల సార్లు క్షమాపణలు చెబుతూనే వుండాలి.
అంతలా, జబర్దస్ అనే కామెడీ షో, బూతులతో నిండిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులతో, అడల్ట్ కామెడీని పెంచి పోషించింది.
ఇప్పుడు ఎవరూ పెద్దగా జబర్దస్త్‌ని పట్టించుకోవట్లేదుగానీ, అప్పట్లో అదో సంచలనం.! రోజా అలానే నాగబాబు అప్పట్లో జడ్జిలుగా వ్యవహరించారు ఈ కామెడీ షోకి.
అనసూయతోపాటుగా రష్మి గౌతమ్ కూడా యాంకర్‌గా వ్యవహరించింది జబర్దస్త్ కామెడీ షోకి.!
