Naga Chaitanya Samantha Sneham ఆమె కత్తులు దూసింది.! అతడేమో, ఆమె కూడా చల్లగుండాలంటున్నాడు.!
సమంత (Samantha Ruth Prabhu), అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya).. ఈ ఇద్దరూ విడాకుల అనంతరం వ్యవహరించిన తీరు ఇది.!
ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. కానీ, అక్కినేని నాగ చైతన్య – సమంత.. కలకాలం కలిసి కాపురం చేయలేకపోయారు.! ఎందుకిలా.? అసలేమయ్యింది.?
‘ఏమాయ చేశావె’ సినిమా సమయంలో చిగురించిన ప్రేమ.. చాలాకాలం తర్వాత ఓ కొలిక్కి వచ్చి, వైవాహిక బంధం దిశగా అడుగులేసేలా చేసింది.
కానీ, వైవాహిక జీవితంలో ఏర్పడ్డ మనస్పర్ధలతో చక్కని జంట కాస్తా, విడిపోయింది. ఎవరి దారి వారు చూసుకున్నారు.! తమ తమ సినిమాలతో ఇద్దరూ బిజీ అయిపోయారు.
Naga Chaitanya Samantha Sneham.. ఈ కత్తుల గోలేంటి.?
ఓ ఇంటర్వ్యూలో సమంత (Samantha) మాట్లాడుతూ, అక్కినేని నాగచైతన్యనీ.. తననీ ఓ గదిలో వదిలేస్తే.. అందులో కత్తులు (షార్ప్ ఆబ్జెక్ట్స్) వుండకూడదని చెప్పింది.
కాలం అన్ని గాయాల్నీ నయం చేస్తుందంటాడో కవి.!
కానీ, కొన్ని గాయాలు నిత్యం బాధిస్తూనే వుంటాయ్..
ఏళ్ళ తరబడి ఏడిపిస్తుంటాయ్.! విడాకులు కొందరికి గాయం.. కొందరికి ఉపశమనం.!
గాయపడ్డోళ్ళు బాధపడుతూనే వుంటారు.. ఉపశమనం పొందినోళ్ళు కొత్త జీవితాన్ని సంతోషంగా గడిపేస్తారు.!
ఇంతకీ, సమంత పరిస్థితేంటి.? నాగచైతన్య సంగతేంటి.?
సినీ సెలబ్రిటీలు కావొచ్చు.. కానీ, వాళ్ళూ మనుషులే.!
భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకుంటున్నారొకరు.. ఇంకొంకరేమో బయటపడిపోతున్నారు.!
తప్పెవరిది.? గాయం ఇద్దరికీ.. ఎవరి గాయం తీవ్రత ఎక్కువ.?
Mudra369
అంటే, అంత దారుణంగా ఇద్దరి మధ్యా గొడవలున్నాయన్నమాట. సరదాగా చెప్పిందని అనుకోలేం. మనసులో చాలా ‘పెట్టుకుని’ బహుశా సమంత అలా చెప్పి వుండొచ్చు.
ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద రచ్చకే కారణమయ్యింది. నాగచైతన్య మీద సమంత ఇలా కక్ష తీర్చుకుంటోందంటూ బోల్డన్ని విశ్లేషణల్ని చూశాం.
నాగచైతన్య వ్యవహారం వేరేలా వుంది. కూల్ అండ్ లవ్లీ. ఎక్కడా సంయమనం కోల్పోవడంలేదు. ఆచి తూచి మాట్లాడుతున్నాడు.. మాట్లాడాల్సి వచ్చినప్పుడు.

‘మేమిద్దరం పరస్పర అవగాహనతో విడాకులు తీసుకున్నాం. కానీ, ఆ తర్వాత మా గురించి దుష్ప్రచారం జరుగుతోంది’ అని చెప్పాడు నాగచైతన్య (Akkineni Naga Chaitanya).
సమంత సల్లంగుండాలె.!
కొందరు సృష్టించే అర్థం పర్థం లేని ఊహాగానాల వల్ల మా ఇద్దరి మధ్యా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని కూడా నాగచైతన్య (Nagachaitanya) అంటున్నాడు.
మూడో వ్యక్తిని మధ్యలోకి తీసుకురావడం తగదనీ మీడియాకీ, నెటిజన్లకీ చురకలంటించే ప్రయత్నం చేశాడు. సమంత ఆనందంగా వుండాలనీ ఆకాంక్షించాడు.
Also Read: ‘బ్లూ’ టిక్ పోయిందే.! సెలబ్రిటీల ఆర్తనాదాలు.!
విషయం ఎంత క్లియర్‌గా వుందో కదా.! కానీ, సమంత (Samantha Ruth Prabhu) వల్లనే కాంప్లికేట్ అవుతోందన్నమాట.! మహిళ కదా.. ఆమెకి కొన్ని అదనపు సమస్యలుంటాయ్.
పైగా, సమంత ఏం మాట్లాడినా.. చిలువలు పలువలు మామూలే.! ఈ విషయంలో సమంతనీ పూర్తిగా తప్పు పట్టేయలేం. కాకపోతే, మాటలు కాస్త కంట్రోల్‌లో పెట్టుకుంటే ఆమెకే మంచిది.