Anasuya Bharadwaj The Vijay ఏమయ్యింది అనసూయకి.? అప్పుడెప్పుడో ఓ సినిమా వేడుకలో విజయ్ దేవరకొండ, ఏదో అనకూడని మాట అన్నాడు. అది కూడా అనసూయని ఉద్దేశించి కాదు.!
జనరల్‌గా మాట్లాడేసిన ఓ మాట మీద అప్పట్లో అనసూయ (Anasuya Bharadwaj) గుస్సా అయ్యింది. దానికి విజయ్ దేవరకొండ అభిమానుల నుంచి కౌంటర్ ఎటాక్ కూడా అంతకు మించిన స్థాయిలో వచ్చింది.
మొన్నీమధ్యనే వచ్చిన ‘లైగర్’ సినిమా ఫ్లాపయితే, ‘కర్మ’ అంశాన్ని ప్రస్తావిస్తూ సెటైరేసింది. అప్పుడు మళ్ళీ రచ్చ మొదలైంది.
Anasuya Bharadwaj The Vijay ఎందుకీ కెలుకుడు.?
‘‘ఇప్పుడే ఒకటి చూశాను.. ‘ది’నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం..’’ అంటూ ట్వీటేసింది అనసూయ.
అయినా, విజయ్ దేవరకొండని కెలికితే అనసూయకి ఏమొస్తుంది.?
రౌడీస్.. అదేనండీ, విజయ్ దేవరకొండ అభిమానులెందుకు అనసూయని సీరియస్‌గా తీసుకోవాలి.?
విజయ్ విషయంలో అభిమానులు అత్యుత్సాహం చూపుతున్నదే నిజమైతే, అనసూయ చేస్తున్నదేంటి.?
‘లైగర్’ డిజాస్టర్ నేపథ్యంలో సంబరాలు చేసుకున్న అనసూయ ఎన్ని డిజాస్టర్లను ఇటీవలి కాలంలో చవిచూసింది.?
ఇదో నెవర్ ఎండింగ్ ఫైట్.! తన పేరు ముందర ఎవరూ ‘ది’ అని తగిలించరు గనుక, విజయ్ దేవరకొండ పేరు ముందర ‘ది’ చూసి కుళ్ళకుంటోందన్నమాట.!
అబ్బాయ్‌లూ అని సెటైరేసినప్పుడు.. ఆంటీ.. అని అట్నుంచి సెటైర్ పడితే, జీర్ణించుకోగలగాలి కదా.?
Mudra369
విషయమేంటంటే, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొత్త సినిమా ‘ఖుషీ’కి (Kushi Movie) సంబంధించిన పోస్టర్లలో ‘ది విజయ్ దేవరకొండ’ అని పేర్కొంటున్నారట.
Also Read: అఖిల్ ‘ఏజెంట్’ని ‘తొక్కే’స్తున్న ‘నందమూరి’! కారణమిదే!
ఆ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. దాన్నే అనసూయ ప్రస్తావించింది.. అయితే, నేరుగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేరు ప్రస్తావించలేదు.

అక్కడితో ఆగిందా.? ‘భలే రియాక్ట్ అవుతున్నార్రా.. దొంగ.. ఊప్స్.. బంగారుకొండలంట.. ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తూనే వున్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలూ..’ అంటూ మరో ట్వీటేసింది.
కావాలనుకుంటే అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) కూడా తన పేరు ముందర ‘ది’ అని తగిలించుకోవచ్చు. ఎవరు కాదన్నారని.?