Andhra Pradesh Capital Amaravati.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ మధ్యన రాష్ట్ర రాజధాని అమరావతి నలిగిపోతోందనే చర్చ సాధారణ ప్రజానీకంలో నడుస్తోంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, 13 జిల్లాలకు అమరావతి (Amaravati) రాజధాని అయ్యింది. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అదీ ప్రతిపక్ష నేత హోదాలో.
చంద్రబాబు హయాంలో అమరావతి పేరుతో పబ్లిసిటీ స్టంట్లు నడిచాయని అప్పట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన రాజకీయ విమర్శల సంగతి సరే సరి. గతం గతః
Andhra Pradesh Capital Amaravati.. తాత్కాలికమా.? శాశ్వతమా.?
అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని. అక్కడ ‘తాత్కాలికం’ పేరుతో శాశ్వత నిర్మాణాలు జరిగిన మాట వాస్తవం. అందులో సెక్రెటేరియట్, అసెంబ్లీ సహా హైకోర్టు కూడా వున్నమాట కూడా నిజం.
చంద్రబాబు ప్రచారం చేసుకున్నట్టు అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేంత ఆర్థిక స్తోమత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేకపోవచ్చు. ఓ చిన్న రాజధానిగా అయినా అమరావతిని అభివృద్ధి చేయొచ్చు కదా.?

కానీ, అలా జరగడంలేదు. అమరావతి నిర్మాణ పనులు, 2019 ఎన్నికల తర్వాత ‘ఇంచు’ కూడా ముందుకు సాగలేదు. దానికి అమరావతిపై వైసీపీ అక్కసే కారణమంటారు ఇతర పార్టీలకు చెందిన నేతలు.
అమరావతి తెలుగుదేశం పార్టీదీ కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదీ కాదు.. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం.
ఒకటో.. రెండో.. మూడో.!
ముందైతే ఒక రాజధానిని పూర్తి చేసుకుంటే, ఆ తర్వాత మరో రెండు కడతారో, ఇరవై రెండు కడతారో.. అధికారంలో వున్నవారి ఇష్టం.!
‘మూడు’ పేరుతో అమరావతిని మూలన పడేస్తే, నష్టపోయేది రాష్ట్రమే.!
బేషజాలను పక్కన పెట్టి, కమ్మరావతి అనో.. స్మశానమనో.. ఎడారి అనో.. ఇలాంటి పిచ్చివాగుడు కట్టిపెట్టి, రాజధాని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు.. అన్న కోణంలో ఆలోచిస్తే, రాష్ట్రానికి అమరావతి పెద్దదో, చిన్నదో.. ఓ రాజధానిలా వుంటుంది.
Also Read: చిరంజీవి దేవుడట.! పవన్ కళ్యాణ్ దెయ్యమట.!
కేవలం అమరావతి భవిష్యత్తే, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు.. అనడం సబబు కాదేమో.! కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తే.!
ఆ రాజధాని అమరావతి గనుక, అమరావతి భవిష్యత్తుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి వుంది.