Table of Contents
Andhra Pradesh Capital – భారతదేశానికి ఒకే ఒక్క రాజధాని. అలాంటప్పుడు, భారతదేశంలోని ఓ రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు.? చాలామందిలో సహజంగానే తలెత్తే ప్రశ్న ఇది. కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైద్రాబాద్‌కే పరిమితం కావడంతో, ఆ హైద్రాబాద్‌ని కోల్పోవాల్సి వచ్చినప్పుడు, విభజన కారణంగా నష్టపోయిన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రోడ్డున పడిపోయింది.
పైగా, విభజన తర్వాత కూడా, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల ‘చర్చ’ తెరపైకొచ్చింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ‘ఆంధ్ర రాష్ట్రం’ విడిపోయినప్పుడు, కర్నూలు రాజధాని అయ్యింది.. ఆ ఆంధ్ర రాష్ట్రానికి. ఆ ఆంధ్ర రాష్ట్రమే. అప్పటి హైద్రాబాద్ స్టేట్‌తో కలిశాక ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిందని అంటాంగానీ.. నిజానికి, పాత పేరుతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అనడం సబబంటారు కొందరు.
Andhra Pradesh Capital రాజధాని.. అదో బ్రహ్మపదార్థం
గతం గతః గతాన్ని ఎలాగూ వెనక్కి తీసుకురాలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఓ ఘనమైన రాజధానిని నిర్మించుకుని తీరాల్సిందే. ఈ క్రమంలోనే అమరావతి తెరపైకొచ్చింది. ‘అందరికీ అందుబాటులో’ అంటూ రాష్ట్రం మధ్యనున్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. దానికి అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదం పలికింది.
Also Read: హీరో నిఖిల్ కుర్రతనం.. ఎందుకీ అత్యుత్సాహం.?
కానీ, ఏమయ్యిందో.. వైసీపీ గొంతు మార్చుకుంది. అమరావతి పూర్తిస్థాయి రాజధాని కాదు, అందులోంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని తీసి, విశాఖకు తరలిస్తాం.. జ్యుడీషియల్ క్యాపిటల్‌ని తీసి కర్నూలుకి తరలిస్తాం.. అలా చేయడం ద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ న్యాయం జరిగినట్లవుతుంది.. పైగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని వైఎస్ జగన్ ప్రభుత్వం సెలవిచ్చింది.
రాజధాని లేదా రాజధానులు.. ఎప్పుడు.? ఎలా.?
జస్ట్ మాట చెప్పి ఊరుకోలేదు, నానా రగడా జరిగినా.. చట్ట సభల సాక్షిగా ‘చట్టం’ చేసేసింది వైఎస్ జగన్ సర్కార్, మూడు రాజధానుల విషయమై. మరి, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితేంటి.? ఈ ప్రశ్న చుట్టూనే, కోర్టుల్లో పిటిషన్ల దాఖలయ్యాయి. వాటి కారణంగా, రాష్ట్ర రాజధాని వ్యవహారం అయోమయంలో పడింది.
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
ఏడేళ్ళ తర్వాత కూడా పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరక్కపోవడం ఒకింత ఇబ్బందికరమైన అంశమే. ఏ ప్రభుత్వమైనాసరే, దీన్ని అవమానంగానే భావించాలి. ఒక రాజధాని అంటారా.? మూడు రాజధానులంటారా.? ఏదో ఒకటి తేల్చెయ్యాలి. లేకపోతే, పోయేది రాష్ట్ర ప్రజల పరువే.
మూడు సరిపోతాయా.? ముప్ఫయ్ మూడు కావాలా.?
రాజధాని అంటే, అది ఆత్మగౌరవ సమస్య లాంటిదే. దేశానికి ఢిల్లీ ఎలాగో.. రాష్ట్రానికి కూడా అలాంటిది ఒకటి వుండాలి కదా.? ఒకటి కాకపోతే, మూడు.. కానీ, తొందరగా జరగాలి. ‘మూడు’కి సమస్యలుంటే, ఒక్కటైనా సంపూర్ణ రాజధానిగా అభివృద్ధి చెందాలి. కానీ, అది జరుగుతుందా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: Black Water: ఈ మంచి నీళ్ళు ఎందుకంత స్పెషల్.?
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే వ్యక్తి మారిన ప్రతిసారీ రాజధాని (Andhra Pradesh Capital) మార్పు.. అంటే అది వినడానికే రోతగా వుంటుంది. అప్పుడు ఒక్కటే.. అన్నారు. ఇప్పుడు మూడు.. అంటున్నారు.. ముందు ముందు ముప్ఫయ్ మూడు.. అని ఇంకెవరన్నా అంటే ఏంటి పరిస్థితి.?