ఓ వైపు జనం ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా వైరస్.. దాంతోపాటు వెలుగు చూస్తోన్న రంగు రంగుల ఫంగస్సుల కారణంగా. మొదట బ్లాక్ ఫంగస్ అన్నారు.. ఆ తర్వాత వైట్ ఫంగస్ అన్నారు.. ఇంతలోనే ఓ రాజకీయ ఫంగస్ తెరపైకొచ్చింది. దాని పేరు ‘యెల్లో ఫంగస్’ అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఓ ప్రధాన రాజకీయ పార్టీ నుంచి పొలిటికల్ సెటైర్లు (Andhra Pradesh Covid 19 TDP YSRCP Political Fungus) షురూ అయ్యాయి.
పెద్ద షాక్ ఏంటంటే, నిజంగానే యెల్లో ఫంగస్ కూడా వుందంటూ వైద్య రంగ నిపుణులు వెల్లడించడం. యెల్లో ఫంగస్ కూడా ప్రమాదకరమైనదేనట. బ్లాక్ ఫంగస్ విషయమై ప్రభుత్వాలు కంగారుపడుతున్నాయి. వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. బాధితులైతే, సంబంధిత మెడిసిన్స్ కోసం నానా తంటాలూ పడుతున్నారు.
Also Read: నాయకులంతా వాళ్ళే.. రాజకీయాల్లో ‘మంచి మార్పు’ వచ్చేదెలా.?
మన దేశంలో, అందునా మన తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత హేయమైన రీతిలో నడుస్తున్నాయి. యెల్లో వైరస్.. అంటూ రాజకీయ దాడి మొదలు పెట్టారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెటిజన్లు. దానికి కౌంటర్ ఇస్తూ, బ్లూ వైరస్.. అంటూ టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ షురూ చేశారు.
Also Read: Covid 19: ఆ భయమే.. వాళ్ళకి ఆదాయం.!
ఏమో, రేపో మాపో బ్లూ ఫంగస్.. అంటూ నిజంగానే ఓ హెచ్చరికని వైద్య వర్గాల నుంచి వినవాల్సి వస్తుందేమో. కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్.. ఇలాంటివాటికి మందులు కనిపెట్టడం సాధ్యమే కావొచ్చుగానీ.. పొలిటికల్ ఫంగస్.. అదేనండీ ‘రాజకీయ ఫంగస్’కి (Andhra Pradesh Covid 19 TDP YSRCP Political Fungus) మాత్రం మందుని కనిపెట్టడం ఎవరితరమూ కాదు.