Andhra Pradesh Political Business.. ఒకరేమో రాజకీయ వ్యభిచారమంటారు.! ఇంకొకరేమో సంతలో పశువుల్లా అమ్ముడుపోయారంటారు.! ప్యాకేజీ స్టార్.. దత్త పుత్రుడు.. ఇలాంటి ఆరోపణలకు కొదవే లేదు.!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇదొక విచిత్రం.! టీడీపీకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారన్నది వైసీపీ ఆరోపణ.
కాదు కాదు, వైసీపీనే (YSR Congress Party) నలుగురు టీడీపీ (Telugu Desam Party) ఎమ్మెల్యేలను కొనేసిందని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది.
ఏది నిజం.? దత్త పుత్రుడు ఎవరు.? ప్యాకేజీ స్టార్ ఎవరు.? ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
Andhra Pradesh Political Business.. అమ్ముడుపోయింది వాస్తవం.!
టీడీపీ Telugu Desam Party) నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకేశారు. జనసేన నుంచి ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత చోటు చేసుకుందీ జంపింగ్ వ్యవహారం.
మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీని (YSRCP) కాదని టీడీపీకి (TDP) ఓటేశారట. ఆ విషయాన్ని వైసీపీనే వెల్లడించింది.
ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకునే రాజకీయ నాయకులు.. ప్రజా ప్రతినిథులయ్యాక అమ్ముడుపోవడం అత్యంత జుగుప్సాకరం.!
రాజకీయ వ్యభిచారమనో.. సంతలో పశువులనో.. ప్రజా ప్రతినిథుల్ని అవమానించడమంటే.. రాజకీయ నాయకులు తమను తాము అవమానించుకోవడమే.!
దురదృష్టం.. ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్నది ‘ప్రజా సేవ’ కాదు.. అమ్మకాలు, కొనుగోళ్ళు మాత్రమే.!
రాజకీయమంటే ఇప్పడు కేవలం వ్యాపారం మాత్రమే.! దానికి అదనంగా కక్షలూ.. కార్పణ్యాలు.!
Mudra369
‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు’ అని వైసీపీ (YSR Congress Party) ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 10 నుంచి 20 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యేనీ టీడీపీ కొనేసిందన్నది సజ్జల ఆరోపణ.
‘నేను అమ్ముడుపోయానంటావా.? కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, నీ వెంట తిరిగేందుకు నువ్వెంత ఇచ్చి నన్ను కొనుక్కున్నావ్.?’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకటి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
ప్యాకేజీ స్టార్ ఎవరు.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) మీద దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్.. అని వైసీపీ ఆరోపించడం సహజమే. మరిప్పుడు ఎవరు ప్యాకేజీ స్టార్.? ఎవరు దత్త పుత్రుడు.?
అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఏమనాలి.? కొనుక్కుంటున్న రాజకీయ పార్టీల్ని ఏమనాలి.? ఎవరు ఎవరికి దత్తత వెళ్ళారు.? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.!
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
ఆ నలుగురు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు గురవుతున్నారు. ఇటు వైపు నలుగురు.. అటు వైపు నలుగురు.. సో, మొత్తంగా ఎనిమిది మంది.!
అన్నట్టు, ఇంకొకాయన.. అదేనండీ జనసేన ఎమ్మెల్యే కూడా వున్నారు లిస్టులో. వెరసి, మొత్తంగా తొమ్మిది.! నవరత్నాలివి.! ఔను, రాజకీయ నవరత్నాలు.!