Anicka Vikraman.. తెరపై అందంగా కనిపించే తారల మేకప్ వెనక దాగిన కష్టాలెన్నో. ఆ మేకప్ ముసుగున తమ కష్టాల్ని కనిపించకుండా దాచేస్తుంటారు అందాల భామలు.
మేకప్ అంటే కేవలం ముఖానికి పూసుకునే రంగు మాత్రమే కాదండోయ్. బలవంతంగా తెచ్చుకునే నవ్వు కూడా.
అసలు మ్యాటర్ ఏంటంటే, అనికా విక్రమన్.. అనే నటి తన బోయ్ ఫ్రెండ్ విషయంలో మోసపోయింది. ఓ శాడిస్టును ప్రేమించి, ఫలితంగా అతని చేతిలో చావు దెబ్బలు తినింది.
అదేంటీ.! ప్రేమిస్తే చచ్చేంతలా చితక్కొట్టేస్తారా.? డీటెయిల్డ్‌గా విషయంలోకి వెళితే, అనికా విక్రమన్ బోయ్ ఫ్రెండ్ పేరు అనూప్ పిళ్లై. ప్రేమించిన తర్వాతే తెలిసింది వాడొక శాడిస్ట్ అని.
Anicka Vikraman.. అనిక.. అలా ఎలా బుక్కయిపోయిందో.!
చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా ఆమె అందమైన ముఖం బోయ్ ఫ్రెండ్ దెబ్బలకు వాచిపోయింది. మరీ అంత దారుణంగా కొట్టేస్తాడా.?
అవును మరి, కొందరు శాడిస్టులుంటారుగా. ఆ తరహా శాడిస్ట్ కోవకు చెందిన వాడే ఈ అనూప్ పిళ్లై. బోయ్ ఫ్రెండ్ చేతిలో చావు దెబ్బలు తిన్న అనికా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
తాను ఎదుర్కొన్న పైశాచిక దాడికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసి, తన బోయ్ ఫ్రెండ్ అసలు రంగును బయటపెట్టింది అనికా.
అయితే, ఇప్పుడిప్పుడే ఆ దెబ్బల నుంచి కోలుకుంటున్నాననీ, త్వరలోనే మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా వున్నాననీ అంటోంది.
చంపేస్తానంటూ బెదిరింపులు..
అయినా సెలబ్రిటీలు ఇలాంటి శాడిస్టుల వలలో ఎలా పడుతుంటారు.? ఒకవేళ పడినా ఆయా విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వారికి రకరకాల అవకాశాలుంటాయ్. కానీ, అనికా ఎందుకిలా బుక్కైపోయింది.
Also Read: సుస్మితా సేన్‌కి ‘హార్ట్ ఎటాక్’ రావడమేంటి.?
బోయ్ ప్రెండ్ కారణంగా తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి గతంలోనే రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనీ, ఇప్పుడు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ సోషల్ మీడియా వేదికగా వాపోయింది.
బిగ్‌బాస్ సెలబ్రిటీ అయిన అఖిల్ సార్ధక్‌తో ‘ఫస్ట్ టైమ్’ అను సినిమాలో నటించింది అనికా విక్రమన్. అలాగే, అలాగే కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లోనూ అనిక నటించింది.