Table of Contents
Anil Ravipudi Bhagavanth Kesari.. చెత్త రివ్యూలు ఎందుకు వస్తున్నాయ్.! చెత్త సినిమాలొస్తున్నాయ్ గనుక.! హిట్టు సినిమా.. ఫ్లాప్ సినిమా.! ఇది మామూలే.! ఇక్కడ మేటర్ చెత్త సినిమా గురించి.!
రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’ సినిమా కొన్నాళ్ళ క్రితం వచ్చింది.! అందులో హీరో అంధుడు.! కళ్ళు అస్సలు కనిపించవు.
కానీ, సగటు కమర్షియల్ హీరో చేసేవన్నీ అందులో అంధుడైన హీరో చేసేస్తుంటాడు.! అబ్బో, ఆ విన్యాసాలు చూస్తే ఎవడికైనా బుర్ర పగిలిపోవాల్సిందే.
Anil Ravipudi Bhagavanth Kesari.. కళా ఖండం తీసిన దర్శకుడు..
అంతటి కళా ఖండం తీసిన దర్శకుడు అ‘నిల్’ రావిపూడి, ‘భగవంత్ కేసరి’ సినిమాలో శ్రీలీలతో ఐటమ్ సాంగ్ చేయించి వుండాల్సింది కదా.!
శ్రీలీల నటించిన సినిమాలో, శ్రీలీలతో ఐటమ్ సాంగ్ చేయించడమేంటి.? అంటే, సినిమా అన్నాక లాజిక్కులు వెతక్కూడదు.! పైగా అది, అ‘నిల్’ రావిపూడి సినిమా.!
ఏదో రివ్యూలో, ‘శ్రీలీలతో డాన్సులు చేయించి వుండాల్సింది..’ అని రాశారట. దాన్ని పట్టుకుని, మీడియా సమావేశంలో అ‘నిల్’ రావిపూడి సెటైర్లు వేసేశాడు.
చెత్త సినిమాల సంగతేంటి.?
నిజమే, అదొక చెత్త రివ్యూ.! కానీ, అ‘నిల్’ రావిపూడి చెత్త సినిమాల సంగతేంటి.? ‘ఎఫ్-2’ సినిమా తీసుకున్నా, ‘ఎఫ్-3’ సినిమా తీసుకున్నా.. చెత్త మాత్రం కామన్.!
ఫన్ అంటాడు, ఫ్రస్ట్రేషన్ అంటాడు.. చెత్త తీసేసి, ప్రేక్షకుల ముందుంచేశాడు. ఆ టైమ్‌కి ఆయా సినిమాలు అలా వర్కవుట్ అయిపోతే మాత్రం, హిట్టు సినిమాలవుతాయిగానీ, చెత్త సినిమాలు కాకుండా పోతాయా.?
Also Read: వాళ్ళకి రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్.!
సినిమా క్రియేటివిటీకి ఆకాశమే హద్దు.! ఓ పాత్రని సృష్టించి, ఆ పాత్రకి ఓ డ్రీమ్ వేసేసి.. అందులో శ్రీలీలతో మాంఛి ఘాటైన ఐటమ్ సాంగ్ చేయించేసి వుండొచ్చు.
బహుశా ఆ క్రియేటివ్ థాట్, సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు అ‘నిల్’ రావిపూడికి రాలేదేమో. వచ్చి వుంటే, ఆ కథ వేరేలా వుండేది.
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్..
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. అంటూ, సమాజాన్ని ఉద్ధరించే సందేశాన్ని ఇచ్చేశామని ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) టీమ్ చెప్పుకుంటోంది.
అలా, ఆ ‘టచ్’ గురించి నిండు మనసుతోనే గొప్పగా చెప్పి వుంటే, అభినందించాలి. కానీ, తన సినిమాల్లో.. కమర్షియల్ ఫార్ములా కోసం వేసే వెకిలి వేశాల్ని, అనిల్ రావిపూడి ఎలా సమర్థించుకుంటాడో ఏమో.!
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, అ‘నిల్’ రావిపూడి లాంటోళ్ళు మహానుభావులే మరి.!