Anilkumar Bolla 240Cr Lucky Lottery.. ఎంత కష్టపడితే కోటి రూపాయలు సంపాదించగలం.? ఇంకెంత కష్టపడితే 10 కోట్లు సంపాదించగలం.?
అలాంటిది 10 కాదు, 25 కాదు.. ఏకంగా 240 కోట్లు సంపాదించాడు. అదీ రాత్రికి రాత్రి.!
అతనేమీ అపర కుబేరుడు కాదు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి కూడా కాదు. ఓ సాధారణ వ్యక్తి. పైగా తెలుగోడు. కాకపోతే, అరబ్ దేశంలో ఉద్యోగ, ఉపాధి, వ్యాపార నిమిత్తం స్థిర పడ్డాడు.
ఉద్యోగం చేయడం వల్ల రాత్రికి రాత్రి కోట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎంత పెద్ద వ్యాపారం చేసినా రాత్రికి రాత్రి 240 కోట్లు అంటే.. అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, ఆ వ్యక్తి సాధించాడు.
Anilkumar Bolla 240Cr Lucky Lottery.. లక్కీ విన్నర్ వయసు జస్ట్ 29 ఏళ్ళే..
వయసు జస్ట్ 29 ఏళ్లు. పేరు బోళ్ల అనిల్ కుమార్. అతను చేసిందల్లా ఓ లాటరీ టికెట్ కొనడమే. అరబ్ దేశాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే లాటరీలు నడుస్తుంటాయ్.
అక్కడ మన భారతీయులు అందునా.. తెలుగు వాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకునేందుకు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు.
ఇలా వందల కోట్ల ప్రైజ్ మనీ.. అలాగే ఖరీదైన కార్లు, బైకులు కూడా లాటరీల్లో బహుమతులుగా పెడుతుంటారు.
ఇంతకు ముందు పలువురు తెలుగువాళ్లు లక్కీ లాటరీల్లో కోట్లాది రూపాయలు చేజిక్కించుకున్నారు.
ఖరీదైన కార్లు, బైకులు కూడా దక్కించుకున్నారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో ఓ భారతీయుడు లాటరీ గెలుచుకోవడం అంటే ఇదే తొలిసారి. అబుదాబిలో ఈ లక్కీ లాటరీ నిర్వహించారు.
240 కోట్ల ప్రైజ్ మనీతో ఏం చేస్తాడో..
తన తల్లి జన్మదినాన్ని మ్యాచ్ చేసే నెంబర్ వున్న టిక్కెట్‌తో అనిల్ కుమార్ బొళ్ల లక్కీ లాటరీ విజేతగా నిలిచాడు.
ఇంతకు ముందు కూడా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాననీ, ఈసారి కూడా అలాగే కొనుగోలు చేసి అనూహ్యంగా విజేతనయ్యానని అనిల్ కుమార్ బొళ్ల చెప్పాడు.
తల్లితండ్రులు ఏం అడిగితే అది ఈ డబ్బులతో చేస్తాననీ, అలాగే.. సామాజిక సేవ కోసం కొంత మొత్తం వ్యత్యిస్తానని అన్నాడు అనిల్ కుమార్ బొళ్ల.
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
పన్నుల రూపంలో కొంత మొత్తం అక్కడి ప్రభుత్వానికి వెళ్లిపోయినా.. చాలా పెద్ద మొత్తంలోనే అనిల్ కుమార్ బొళ్లకి దక్కనుంది.
లాటరీలో 240 కోట్లు కొల్లగొట్టడం అంటే.. నిజంగానే ఇదో పెద్ద సంచలనం కదా.! అందుకే ఈ లక్కీ లాటరీ వార్త.. దాంతో పాటుగా అనిల్ కుమార్ బొళ్ల ట్రెండింగ్ అవుతున్నాడు.
గమనిక: లాటరీ ఎన్నో జీవితాల్ని నాశనం చేస్తుంది. లాటరీ ఓ దుర్వ్యసనం.. లక్కీ లాటరీ గెలిచేవాళ్ళు ఒకరో, ఇద్దరో. నష్టపోయేది మాత్రం వేలల్లో, లక్షల్లో వుంటారు.
