Table of Contents
Elon Musk Twitter Deal.. ఎలాన్ మస్క్.. గొప్ప వ్యాపార వేత్త మాత్రమే కాదు, మాంఛి సెన్సాఫ్ హ్యూమర్ వున్నోడు కూడా.! అంతరిక్షంలోకి రాకెట్లు పంపడమే కాదు, సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేయగలడు.!
ప్రపంచ కుబేరుడై వుండి, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాన్ని కొనుగోలు చేయాలని ఎలాన్ మస్క్ అసలు ఎందుకు అనుకున్నాడట.!
అయినా, ఎలాన్ మస్క్ ఎందుకు ట్విట్టర్‌ని కొనుగోలు చేయాలని అనుకోకూడదు.? ఆయన దృష్టిలో ప్రతీదీ వ్యాపారమే.
Elon Musk Twitter Deal.. మనీ మేక్స్ మెనీ థింగ్స్.!
ట్విట్టర్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్న దరిమిలా, అందులో బోల్డంత లాభాన్ని బహుశా ఆయన ఆశించి వుండొచ్చు. అందుకే, ట్విట్టర్‌ని కొనేయాలని ఎలాన్ మస్క్ అనుకుని వుండొచ్చు.
ఛత్, ఎలాన్ మస్క్ లాంటోళ్ళు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్ని కొనుగోలు చేసేస్తే, అసలంటూ భావ ప్రకటనా స్వేచ్ఛకే అర్థం వుండదని చాలామంది అన్నారు. అందులోనూ నిజం లేకపోలేదు.
ట్విట్టర్ అందరికీ ఉచితం అనేది అస్సలు సబబు కాదన్నాడు ఎలాన్ మస్క్. కొందరికి మాత్రమే ఉచితంగా దాన్ని అందించాలన్నాడు.
ఇంతకీ, ఎలాన్ మస్క్ కొన్నాడా.? లేదా.?
పెద్ద పంచాయితీనే నడిచింది.. కొంటున్నాడు, కొనేస్తున్నాడు.. కోనేశాడని కూడా అన్నారు. కానీ, పెద్ద మెలిక ఈ డీల్ వ్యవహారాన్ని గందరగోళంలోకి నెట్టేసింది.

తూచ్.! ఇక నా వల్ల కాదు.! అంటూ ఎలాన్ మస్క్ చేతులెత్తేశాడు ట్విట్టర్‌ని కొనుగోలు చేయడంపై. ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్.. ట్విట్టర్ యాజమాన్యం నుంచి.. మళ్ళీ మస్క్ మీద ఒత్తిడి.. కేసులు, అదో పెంట వ్యవహారమట.
ఏం ఎటకారం చేస్తివి మస్కూ.!
ఇంతలోనే ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగానే సెటైరేశాడు. ట్విట్టర్‌కీ, తనకీ సంబంధించి నాలుగు దశల్ని అందులో పేర్కొన్నాడు.
ట్విట్టర్ కాకపోతే, మరొకటి.. నెటిజన్లకు వేరే ఆప్షన్ లేదనుకుంటే ఎలా.? పూటకో కొత్త యాప్ అందుబాటులోకి వస్తోన్న రోజులివి. ప్రపంచం చాలా మారిపోయింది.
Also Read: ఔరా.. ‘ఉంగరం’లో మీ ఆరోగ్యం.! టూ స్మార్ట్ సుమీ.!
ఆ విషయం తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు ఎలాన్ మస్క్. అందుకే, ట్విట్టర్ ఆలోచనల్ని పక్కన పెట్టాడనుకోవాలేమో.
దేన్నయినా, పెట్టుబడి.. లాభాలు.. ఇలా అంతా వ్యాపార కోణంలో చూసే ఎలాన్ మస్క్, ట్విట్టర్‌ని కొనాలనుకున్నా.. దాన్ని వదిలేయాలనుకున్నా.. అన్నీ ‘లెక్కలకు లోబడే’ జరుగుతాయ్.!