దేవాలయాల్లో దేవతామూర్తులకు క్షీరాభిషేకం చేయడం అనేది హిందూ సంప్రదాయంలో ఎప్పటినుంచో వున్న ప్రక్రియే. ఇక్కడ క్షీరాభిషేకం.. అంటే, లీటర్ల కొద్దీ పాలను గుమ్మరించేయడం కాదు. పైగా, అలా క్షీరాభిషేకం (Anointing Milk Save Milk For Needy Dont Waste) చేశాక, కొంచెం కూడా వృధా చేయకుండా, దాన్ని ప్రసాదంగా తీసుకోవడం అనేది ఒకప్పటి పద్ధతి. కానీ, ఇప్పుడలా కాదు.
లీటర్ల కొద్దీ పాలను గుమ్మరించేయడం, వాటిని వృధా చేయడం, రికార్డుల కోసం నానా తంటాలూ పడటం నేటి ట్రెండ్. దేవతా మూర్తుల విగ్రహాలకు జరిగే క్షీరాభిషేకాల సంగతి పక్కన పెడితే, ప్రముఖుల చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు ఎక్కువైపోయాయ్ ఇటీవలి కాలంలో.
పలానా సినిమా హీరో ‘నిలువెత్తు కటౌట్’ మీద క్షీరాభిషేకం చేసేస్తున్నారు. ఇందు కోసం వందల లీటర్ల పాలను వృధా చేస్తున్నారు అభిమానులు. సినీ ప్రముఖులకే కాదు, రాజకీయ ప్రముఖులకూ ఈ తరహా క్షీరాభిషేకాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి.
సినీ అభిమానం వేరు.. రాజకీయ అభిమానం వేరు. సినీ అభిమానం అంటే.. చచ్చేదాకా అలాగే కొనసాగుతుంది. రాజకీయ అభిమానం అలా కాదు.. నాయకులు పార్టీలు మార్చినట్లే, వారి వారి అనుచరులూ పార్టీలు మార్చేస్తుంటారు. మరి, రాజకీయాల్లో పాలాభిషేకాలు (Save Milk For Needy Dont Waste In The Name Of Honor) ఎందుకు జరుగుతున్నాయి.? అంటే ఇదో పైత్యం.
పుట్టలో పాలు పోయడం అనేది ఏదో పద్ధతి కోసం.. కొద్ది మొత్తం పాలతో చేస్తే సరిపోతుంది. అంతేగానీ, ప్యాకెట్లకు ప్యాకెట్లు పోసేస్తే ఏం లాభం.? దేవాలయాల దగ్గర కూడా మురికి కాల్వల్లో కలిసిపోతున్నాయి విలువైన ‘పాలు’ కొందరు మూర్ఖుల కారణంగా.
ఇప్పుడీ చర్చ ఎందుకు తెరపైకొచ్చిందంటే.. సినీ నటుడు సోనూ సూద్, కరోనా నేపథ్యంలో ‘చేతికి ఎముక లేదన్నట్టు’ సాయం అందిస్తున్నాడు అవసరమైనవారికి. ఈ క్రమంలో కొందరు అభిమానులు, సోనూ సూద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసేశారు. ఈ వ్యవహారం సోనూ సూద్ దృష్టికి వెళ్ళింది.
‘నా చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేయొద్దు. అందుకోసం వినియోగించే పాలని, ఆకలితో అలమటిస్తున్నవారికి అందించండి.. అది నా తరఫున మీరు చేసిన సేవగా నేను భావిస్తాను..’ అంటూ సోనూ సూద్ అభ్యర్థించాడు. నిజానికి, చాలామంది సినీ ప్రముఖులు తమ అభిమానులకు ఇలాంటి విజ్నప్తులే చేస్తుంటారు. కానీ, అభిమాన పైత్యం.. (Anointing Milk Save Milk For Needy Dont Waste) ఆగదు కదా.. ఆలోచించదు కదా.?