Home » Shruti Haasan: వావ్.. ఇది మరీ టూమచ్.!

Shruti Haasan: వావ్.. ఇది మరీ టూమచ్.!

by hellomudra
0 comments
Shruti Haasan About Kamal Haasan Divorce and Breakup

చక్కనమ్మ ఏం చెప్పినా చక్కగానే వుంటుందని వెనకటికి ఓ మహానుభావుడు ఎందుకన్నాడోగానీ, ఒక్కోసారి అది వినడానికీ ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. లేకపోతే, విడిపోవడంలో ఆనందమేంటి.? అదీ తల్లిదండ్రులు విడిపోతే ఆనందపడే పిల్లలుంటారా.? వున్నారు.. అందుకు శృతిహాసన్ (Shruti Haasan About Kamal Haasan Divorce and Breakup) పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ తన తండ్రి కమల్ హాసన్ తన తల్లి సారిక విడిపోవడం తనకు ఆనందమేనని సెలవిచ్చి అందర్నీ విస్మయానికి గురిచేసింది. అయితే, ఇక్కడ శృతిహాసన్ మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలేమో. కలిసి వుండి, రోజూ గొడవ పడటం కంటే.. విడిపోయి స్నేహితుల్లా వుండడం.. పిల్లలకు సంతోషాన్నివ్వడం అనేది కొత్త కాన్సెప్ట్.

ఈ మధ్య చాలా జంటలు ఇలాగే విడిపోతున్నాయి. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తన భార్య సుజానే ఖాన్‌తో కొన్నాళ్ళ క్రితమే విడిపోయారు. కానీ, పిల్లల కోసం అడపా దడపా కలుసుకుంటున్నారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి జంటలు బాలీవుడ్‌లో చాలానే కనిపిస్తాయి.

కమల్ హాసన్ – సారికను పెళ్ళడాకముందు ఆయనకు వాణి గణపతితో వివాహమైంది. వాణి గణపతితో విడాకులు తీసుకున్నాకే సారికను పెళ్ళాడాడు కమల్. కమల్ – సారిక కుమార్తెలే శృతిహాసన్ (Shruti Haasan About Kamal Haasan Divorce and Breakup), అక్షర హాసన్. ఆ తర్వాత సారికతో విడాకులు తీసుకున్న కమల్, కొన్నాళ్ళపాటు నటి గౌతమితో సహజీవనం చేశారు. కొన్నాళ్ళ క్రితమే గౌతమితో సహజీవనం కథ కూడా ముగిసింది.

ఇక, శృతిహాసన్ విషయానికొస్తే.. ఆమె కూడా మైఖేల్ కోర్సలేతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా బ్రేకప్ అయిపోయింది. తాజాగా మరో బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది శృతి. అన్నట్టు, అక్షర కూడా ఇప్పటికే ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చేసింది.

అఫ్‌కోర్స్.. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలేననుకోండి. అందుకేనేమో, విడిపోవడంలో ఆనందాన్ని శృతి అంత గొప్పగా చెప్పేసుకుంది. ప్రేమించి విడిపోవడం వేరు.. పెళ్ళి చేసుకుని, తల్లిదండ్రులయ్యాక విడిపోయి, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వేరు కదా.?

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group