Ante Sundaraniki OTT పుట్టేది అమ్మాయో, అబ్బాయో తెలియకుండానే ఇంజినీరింగ్ చదివించెయ్యాలా.? మెడిసిన్ చేయించెయ్యాలా.? అని ఆలోచిస్తున్న రోజులివి.
సినిమా రంగంలో కూడా ఇదే జోరు కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కాకుండానే, ఓటీటీ రిలీజ్ డేట్ విషయమై చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి.
‘అంటే సుందరానికీ’ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో వచ్చేయబోతోందహో.. అంటూ ప్రచారం గుప్పుమంది.!
అబ్బే, రెండు వారాల్లో కాదు, మూడు వారాల్లో ఖచ్చితంగా ఓటీటీలో వచ్చేస్తుందంటూ ఇంకో వాదన తెరపైకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చుట్టూ ఈ ఓటీటీ వివాదాలు ఈ మధ్య ఎక్కువైపోయాయ్.
ఈ ఓటీటీ వ్యవహారం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. థియేటర్ల యాజమాన్యాలకైతే గుండె పోటులా మారుతోంది. నిర్మాతలు సైతం నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Ante Sundaraniki OTT నానీకీ ఓటీటీకీ భలే లింకు కుదిరిందే.!
కోవిడ్ పాండమిక్ సమయంలో బ్యాక్ టు బ్యాక్ నాని నుంచి రెండు సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేశాయ్.

తప్పనిసరి పరిస్థితి అది. అయితే, థియేటర్లలో విడుదల చేసే అవకాశం వున్నా ‘టక్ జగదీష్’ విషయంలో ఓటీటీకే మొగ్గు చూపడం అప్పట్లో వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే.
మరి, ‘అంటే సుందరానికి’ విషయంలో ప్రస్తుతం నడుస్తున్న ఈ గొడవపై నిర్మాణ సంస్థ ఏం స్పష్టతనిస్తుంది.?
జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రెండు వారాలు, మూడు వారాలు కాదుగానీ, నెల రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే దిశగా నిర్మాణ సంస్థ పునరాలోచనలో పడిందని అంటున్నారు.
అసలు, ఈ రచ్చ ఎందుకు మొదలైంది.? అంటే, ఈ మధ్య ప్రతి సినిమాకీ ఈ రచ్చ కొనసాగుతూనే వుంది.
Also Read: ధర్మ సందేహం: ఏడ్చే ఆడదాన్ని ఎందుకు నమ్మాలి.!
కాగా, ‘అంటే సుందరానికీ’ సినిమాపై మహేష్ అభిమానుల పేరుతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నది నాని అభిమానుల ఆవేదన.
ఆ మహేష్ అభిమానులే పదిహేను రోజుల్లో ‘అంటే సుందరానికీ’ ఓటీటీలో.. అంటూ ప్రచారం చేస్తున్నారని నాని అభిమానులు గుస్సా అవుతున్నారు.