‘అదిగో పులి..’ అనగానే, ‘ఇదిగో తోక..’ అనేశారు. మీడియా స్పెక్యులేషన్స్‌కి అవకాశమే ఇవ్వకుండా గులాబీ నేతలు (KCR Clarity About KTR and Telangana CM Chair) పోటీ పడ్డారు.
ఇంకేముంది, కేసీయార్ (కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు) సార్ ‘ముఖ్యమంత్రి కుర్చీ’ (Telangana Chief Minister Kalvakuntla Chandra Sekhar Rao) వదిలేస్తున్నారు, ఆ కుర్చీని తన యంగ్ టైగర్ ‘కేటీఆర్’కి (Kalvakuntla Taraka Rama Rao) ఇచ్చేయబోతున్నారంటూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ముఖ్య నేతలు, అందునా మంత్రులు సెలవిచ్చారు.
గులాబీ (Telangana Rashtra Samithi) నేతలు ఒకరితో ఇంకొకరు పోటీ పడి ప్రకటనలు గుప్పించేశారు. ముహూర్తం ఖరారైపోయిందన్నారు. ఇంకేవేవో కథలు చెప్పారు. సాక్షాత్తూ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు KTR) సమక్షంలోనే కొందరు గులాబీ నేతలు.. అందునా కీలక నేతలు ‘కాబోయే సీఎం కేటీఆర్’ అని నినదించడమే కాదు, అందులో కొందరు ‘కంగ్రాట్స్ కాబోయే ముఖ్యమంత్రిగారూ..’ అని విషెస్ కూడా అందించేశారు.
తుస్సుమన్న గులాబీ ‘పులి’హోర!
ఇంత లొల్లి అవసరమా.? కేటీఆర్‌కి పార్టీలో ఏమన్నా తక్కువ ప్రాధాన్యముందా.? కేసీఆర్ (KCR) వున్నపళంగా ముఖ్యమంత్రి పదవి (KCR Clarity About KTR and Telangana CM Chair) వదిలెయ్యాల్సినంత కష్టమేమైనా వచ్చిపడిందా.? లేదంటే, కేటీఆర్ ఏమన్నా తన తండ్రికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా.? అంటూ పొలిటికల్ మీడియా దీర్ఘాలు తీసింది.
కానీ, కేసీఆర్ ఒకే ఒక్క మాటతో మొత్తం అన్ని గాసిప్స్‌కీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇకపై అలాంటి పుకార్లు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు, తగిన చర్యలు తీసుకుంటామని పార్టీ నేతల్ని హెచ్చరించారు. ‘ఇంకో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని. నేను పూర్తి ఆరోగ్యంతో వున్నాను..’ అని కేసీఆర్, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో స్పష్టం చేశారు.
కానీ, ఇదేదో పార్టీ ముఖ్య నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు.. బుకాయిస్తున్నట్లు.. ఏదేదోలా వుందంటూ మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం, గ్రేటర్ హైద్రాబాద్ (Greater Hyderabad Elections) ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ పార్టీలో కాస్తో కూస్తో లుకలుకలు మొదలైన మాట వాస్తవం.
లెక్కలు మారుతున్నాయ్ తెలంగాణలో…
అంతకు ముందు కథ వేరు. గులాబీ పార్టీకి ఎదురే లేదు. కానీ, ఇప్పుడు కమలం పోటు ఎక్కువైపోయింది గులాబీ పార్టీకి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌లో లొల్లి (KCR Clarity About KTR and Telangana CM Chair) షురూ అయ్యిందని అనుకోవాలి. ఏదిఏమైతేనేం, కేసీఆర్ స్పష్టతనిచ్చేశారు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తనకున్న మంత్రి పదవిలో భేషుగ్గా కొనసాగుతారు.. ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపట్టడానికి ఇంకా చాలా టైమ్ వుంది.
ప్రస్తుతానికైతే ఆ అవకాశం లేదని కేసీఆర్ తేల్చేశారు. అయితే, పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని.. అని కేసీఆర్ చెప్పడం ఎంతవరకు సబబు.? ఇది ప్రజాస్వామ్యం.. ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికల్లో ఈక్వేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు. కేసీఆర్ గతంలోలా ముందస్తు ఎన్నికలకు వెళితే.. లేదంటే జమిలి ఎన్నికలు వస్తే.. ఈలోగానే తెలంగాణలో అధికారం కేసీఆర్ చేజారే ప్రమాదమూ పొంచి వుండొచ్చు.
రాజకీయాలంటేనే అంత. ఎప్పుడేం జరుగుతుందో ముందే ఊహించేయలేం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికీ అంత మంచిది కాదు.