Ants Population On Earth.. కామెడీ కాకపోతే, భూమ్మీద చీమలు ఎన్ని వున్నాయో లెక్క పెట్టడమేంటి.? తప్పదు, ఈ భూమ్మీద మనిషి ఎలా వున్నాడో, చీమలు కూడా అలాగే వున్నాయ్.!
జింకని పులి తినాల్సిందే.. అదే పద్ధతి.! ఎందుకంటే, జింక భూమ్మీద గడ్డిని తింటుంది.. ఇదొక సైకిల్.! కానీ, మనిషి మాత్రం అన్నిటినీ తినేస్తాడు. అదే అసలు సమస్య.!
అవసరం వున్నా లేకపోయినా తినేసి పొట్ట పెంచేసి, తరతరాలకీ సరిపడా సంపాదించేస్తుంటాడు.. అందుకే, మనిషి ఈ భూమ్మీద అత్యంత వింత జీవి అయ్యాడు.!
Ants Population On Earth.. ఇంతకీ, చీమలెన్నున్నాయ్ ఈ భూమ్మీద.?
మొత్తం 489 అధ్యయనాలు చేశారట చీమలకు సంబంధించి. ఆ అధ్యయనాల సమాచారాన్ని క్రోడీకరించి 20 క్వాడ్రిలియన్ల చీమలు వున్నాయని అంచనా వేశారు.
ఇంకా నయ్యం, ఖచ్చితమైన సంఖ్య మాత్రం చెప్పలేదు. చెప్పడం సాధ్యం కాదు కూడా. మనుషుల సంఖ్యనే తీసుకుంటే, అదీ చూచాయిగానే చెప్పాలి. చావు పుట్టుకలనేవి జరుగుతూనే వుంటాయ్ కదా.?

చీమల్నే లెక్కించారా.? దోమల్ని కూడా లెక్కెడతారా.? ఏం, దోమలేం పాపం చేశాయని.? వాటికీ లెక్క వుండి తీరాల్సిందే. రేపో మాపో ఆ లెక్కలు కూడా వస్తాయ్. బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలూ.. వీటినీ లెక్కించేద్దామా.?
ఎలా లెక్కపెడతారబ్బా.?
ఇవి జస్ట్ అంచనాలు మాత్రమే. నిజానికి, వీటిని లెక్కేయడం సాధ్యం కాదు. సో, 20 క్వాడ్రిలియన్లు.. అనేవి చెప్పుకోవడానికి జస్ట్ ఓ నంబర్. ఎనీ డౌట్స్.?
Also Read: పారాసిటమాల్.! వెయ్యి కోట్ల మాఫియా.. అంతేనా.?
ఎక్కువగా ఆలోచించెయ్యకండి.. పలు అధ్యయనాలు ఏవేవో లెక్కలేస్తుంటాయ్, వెయ్యాలి కూడా. వాటి ఆధారంగా, చాలా చాలా పరిశోధనలు జరుగుతుంటాయ్.. కొత్త కొత్త ఆవిష్కరణలూ తెరపైకొస్తుంటాయ్.
అన్నట్టు చీమల్లో చాలా రకాలుంటాయ్. ఆ రకాల సంగతేంటి.? అన్ని జాతుల్నీ మనం గుర్తించామా.? మనకు తెలియని జాతులున్నాయా.? అబ్బో, అది మళ్ళీ పెద్ద సబ్జెక్టు.! ఇక్కడితో ఈ చీమ పురాణాన్ని ఆపేద్దాం.!
– సి.సి.