Kayadu Lohar: అల్లు అర్జున్‌ని ఇబ్బందిపెట్టిన ఈ భామ ఎవరు.?

Kayadu Lohar
Kayadu Lohar.. తెలుగు తెరపై కొత్త భామ.! యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ సినిమాలో నటించింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ‘కాయదు లోహార్’ పేరు పలికేందుకు అల్లు అర్జున్ ఒకింత ఇబ్బంది పడటమే, తెలుగునాట ఆమె పేరు అంత పాపులర్ అవడానికి కారణమేమో.
చివరికి, ఆమెకు సారీ చెప్పేశాడు ‘కాయదు లోహార్’ అనే పేరు సరిగ్గా పలకలేకపోయిన అల్లు అర్జున్. కానీ, ఆ వ్యవహారం బోల్డంత ఫన్ జనరేట్ చేసింది.
Kayadu Lohar.. తెలుగు తెరకు కొత్తేగానీ..
తెలుగు తెరకు కాయదు లోహార్ కొత్తేగానీ, నటనకు కొత్త కాదు. ఆమె గతంలో పలు కన్నడ సినిమాల్లో నటించింది. నటిగా బాగానే పేరు సంపాదించుకుందక్కడ.

ఇక, శ్రీవిష్ణు సినిమాల్లో హీరోయిన్లకు నటన పరంగా కొంత ఎక్కువ స్కోప్ లభిస్తుంటుంది. అలా కాయదు లోహార్‌కి కూడా ఆ స్క్రీన్ స్పేస్ బాగానే దక్కి వుండొచ్చు కూడా.!
అస్సాం బ్యూటీ..!
కాయదు లోహార్ అస్సాం బ్యూటీ అట. రాజధాని గువాహటికి దగ్గర్లోని తేజ్‌పూర్ ఆమె స్వస్థలమట.
అల్లు అర్జున్ ఎప్పుడైతే ‘కాయదు లోహార్’ పేరు పలకడంలో ఇబ్బంది పడ్డాడో, ఆ వెంటనే ఎవరీమె.? అంటూ నెటిజన్లు గూగుల్ తల్లిని గట్టిగా అడిగేయడం మొదలెట్టారు.. ఆమె వివరాల్ని తెలుసుకున్నారు. అద్గదీ అసలు సంగతి.
Also Read: Rhea Chakraborty ఈజ్ బ్యాక్.! గ్లామర్ షో షురూ.!
ఎలాగైతేనేం, రావాల్సిన పబ్లిసిటీ అయితే రాబట్టుకుంది కాయదు లోహార్.. తొలి తెలుగు సినిమా విడుదల కాకుండానే తెలుగునాట.
లక్కు బావుంటే, ‘అల్లూరి’ సినిమా హిట్టయితే.. తెలుగు తెరకు ఓ కొత్త అందం దొరికినట్లే.! ఒకే ఒక్క సినిమా సక్సెస్‌తో స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలామందే వున్నారు.
‘ఛలో’ సినిమాతో రష్మిక మండన్న, ‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి రాత్రికి రాత్రి స్టార్లుగా మారిన సంగతి తెలిసిందే. ఏమో, కాయదు లోహార్ కూడా తెలుగునాట సత్తా చాటుతుందేమో.!

అల్లు అర్జున్ ఆమె పేరు పలకడానికి ఇప్పుడైతే ఇబ్బంది పడ్డాడుగానీ, ఏమో తన సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ముందు ముందు ఛాన్స్ ఇచ్చేస్థాయికి ఆమె ఎదుగుతుందేమో.!
