Anupama Parameswaran Dating Gossips.. అనుపమ పరమేశ్వరన్.. మరీ అంత మెతక ఏమీ కాదు. తనని తాను గట్టిగా డిఫెండ్ చేసుకోగలదు.
ఏదైనా విషయం మీద తన వాయిస్‌ని బలంగా వినిపించగలదు కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.
అనుపమ కెరీర్లో హిట్లున్నాయ్.. ఫ్లాపులున్నాయ్. సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా అవకాశాలు వస్తున్నాయ్. కేరళ కుట్టి అయినా తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మొన్నీ మధ్యనే ‘బైసన్’ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అనుపమ పరమేశ్వరన్. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ కూడా ఎక్కువగానే చేస్తోంది అనుపమ.
Anupama Parameswaran Dating Gossips.. అనుపమకి అన్నీ వున్నాగానీ..
వెండితెరపై గ్లామర్ విషయంలోనూ అనుపమ ఏమాత్రం తక్కువ కాదు. ‘అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందాని స్టార్డమ్ పరంగా సరైన స్థాయిని అందుకోలేకపోతోంది అనుపమ.
రీసెంట్గా తెలుగు స్ర్టెయిట్ సినిమా అంటే అనుపమకి ‘కిష్కింధపురి’. కమర్షియల్‌గా ఓ మోస్తరు విజయం అందుకుంది ఈ సినిమా.

గతంలో ఓ క్రికెటర్‌తో అనుపమ డేటింగ్ చేసిందన్న గాసిప్స్ వచ్చాయ్. ఆ క్రికెటర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు అది వేరే సంగతి.
అనుపమకి ఫలానా వ్యక్తితో ఎఫైర్.. అంటూ గాసిప్స్ రావడం మామూలే. కొన్ని సార్లు అనుపమ ఆ గాసిప్స్‌ని ఖండించింది కూడా.
బైసన్ ధృవ్తోనా.?
తాజాగా ‘బైసన్’ హీరో ధృవ్ విక్రమ్‌తో అనుపమ డేటింగ్లో వుందంటూ తమిళ సినీ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.
షరా మామూలుగానే ఇదంతా ఫేక్ అని అనుపమ పరమేశ్వరన్, తన వైపు నుంచి ఇవ్వాల్సినంత స్పష్టత ఇచ్చేస్తోంది.

‘ఏదైనా వుంటే నేనే చెబుతాగా.! ఈ గాసిప్స్ చికాకు పెడుతుంటాయ్..’ అని ఓ సందర్భంలో అనుపమ ఆవేదన వ్యక్తం చేసింది.
అయినా గానీ, అనుపమ చుట్టూ డేటింగ్ పుకార్లు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తుంటాయ్. అనుపమకే ఎందుకిలా అవుతోంది.!
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
సినిమా అన్నాకా గాసిప్స్ సర్వసాధారణం అయిపోయింది. అనుపమ మాత్రమే కాదు, చాలామంది నటీ నటుకి ఈ తరహా గాసిప్స్ దెబ్బ తగులుతూనే వుంది.
