పూజా హెగ్దే బిజీగా వుందట.! పాపం, ఖాళీగా వుందని అనుపమ పరమేశ్వరన్‌ని (Anupama Parameswaran) తీసుకున్నట్టున్నారు. ఏంటో, ఈ సినీ మాయ.!
ఇంతకీ, అనుపమ పరమేశ్వరరన్‌ని ఎందుకు అంతలా అవమానించినట్లు. జస్ట్ జోకేశారంతే, ఇందులో అవమానం ఏమీ లేదు.! టిల్లూగాని సరదా పంచ్ ఇది.!
డీజే టిల్లు గర్ల్ ఫ్రెండ్ అనుపమ.!
‘డీజే టిల్లు’ ఈసారి ‘టిల్లూ స్క్వేర్’ అంటున్నాడు. ఔను, ‘డీజే టిల్లు’ సీక్వెల్‌కి పేరు ‘టిల్లు స్క్వేర్’ అని ఖరారు చేసింది చిత్ర యూనిట్.

టైటిల్ రివీల్ చేస్తూ, ఇంట్రెస్టింగ్ ప్రోమో ఒకటి వదిలారు. టిల్లుగాడు.. కారులో వెళుతుండగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ట్రాఫిక్ సిబ్బంది ఆపుతారు.
అక్కడ మనోడి హంగామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే హీరోయిన్ పూజా హెగ్దే అని తాను అనుకుంటున్నట్లు చెబతాడు టిల్లు.
Also Read: నయా సంచలనం.! ఎవరీ Niharika NM?
పూజా హెగ్గే కాదు.. అక్కడ హీరోయిన్ సెట్స్‌లో రెడీగా వుంది.. అని చెబుతాడు, పక్కనే వున్నోడు. అద్గదీ.. అట్లుంటది టిల్లుగానితోని.!
‘డీజే టిల్లు’ సినిమా కమర్షియల్‌గా బాగా వర్కవుట్ అయ్యింది. మరి, ‘టిల్లు స్క్వేర్’ డబుల్.. అంతకు మించి లాభాలు పొందుతుందా.? వేచి చూడాల్సిందే.